EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp8f02038d-d15d-4a3c-b48f-a3cb39145c67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp8f02038d-d15d-4a3c-b48f-a3cb39145c67-415x250-IndiaHerald.jpgతెలంగాణ బీజేపీలో ముసలం పుట్టనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ అర్వింద్ తప్పుబట్టడం, సీనియర్లకు ఆయన అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావనను బీజేపీలోని కొంతమంది నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బీజేపీని తెలంగాణలో నాశనం చేయాలని చూస్తున్నారా.. లేక పక్కప్రణాళికతోనే దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఎమ్మెల్యేగా ఈటలను, రఘునందన్ రావు లను గెలిపించుకున్నారు. తర్వాత జరిగిన హైదరాBJP{#}Raghunandan Rao;Elections;Election;vishwa;CM;Hyderabad;kavitha;MP;Bharatiya Janata Party;Partyతెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?BJP{#}Raghunandan Rao;Elections;Election;vishwa;CM;Hyderabad;kavitha;MP;Bharatiya Janata Party;PartySat, 18 Mar 2023 08:00:00 GMTతెలంగాణ బీజేపీలో ముసలం పుట్టనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ అర్వింద్ తప్పుబట్టడం, సీనియర్లకు ఆయన అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావనను బీజేపీలోని కొంతమంది నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బీజేపీని తెలంగాణలో నాశనం చేయాలని చూస్తున్నారా.. లేక పక్కప్రణాళికతోనే దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.


బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఎమ్మెల్యేగా ఈటలను, రఘునందన్ రావు లను గెలిపించుకున్నారు. తర్వాత జరిగిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 48 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఒక రకంగా బీజేపీని లైన్ లోకి తీసుకొచ్చారు. అర్వింద్ వ్యాఖ్యలు పార్టీలో దూమారం రేపుతున్నాయి. మరో వైపు శేఖర్, అంజయ్య అనే దళితుడు బండి సంజయ్ అందరిని కలుపుకొని పోతలేరని విమర్శలు చేస్తున్నారు.


బీజేపీ అధిష్టానం మాత్రం సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను మెచ్చుకుంటుంటే సంజయ్ ను సొంత పార్టీ నేతలే ఇరాకాటంలో పెట్టేస్తున్నారు. ఒవరాల్ గా బీఆర్ ఎస్ నేత సీఎం కేసీఆర్ కు ఇది కలిసొచ్చే అంశంలా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో ఎన్ని ఇబ్బందులు కలిగితే అంత బీఆర్ఎస్ లాభం చేకూరుతుందన్నది వాస్తవం.


మరి బీఆర్ ఎస్ నేతలు చేయిస్తున్న వ్యాఖ్యలా.. లేక ఎంపీ అర్వింద్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది బీజేపీలో ఎవరికి అంతుబట్టడం లేదు. బీజేపీ రాబోయే రోజుల్లో అధికారం చేబట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సొంత పార్టీలోనే ముసలం పుట్టడం బీజేపీకి ఇబ్బంది కలిగించే విషయమే.. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సంజయ్ ను బహిరంగంగా విమర్శించే వారి పని పడుతుందా.. లేదా కలిసి పని చేయాలని చెబుతుందా.. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానుండగా  బీజేపీ లో విబేధాలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయనేది నిజం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ ఎందుకు వెనకబడిందో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>