MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbeer-kapoor22b5c7dc-5312-4f6c-8798-2d791eb4faaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbeer-kapoor22b5c7dc-5312-4f6c-8798-2d791eb4faaa-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హిట్ల హీరోల లిస్ట్‌ అనేది వెంట వెంటనే మారపోతోంది. ఒక సీజన్‌లో సక్సెస్ ఫుల్‌ హీరో అనిపించుకున్న స్టార్స్‌ నెక్ట్స్ సీజన్‌లో ఫుల్ ఫ్లాపుల్లో పడిపోతున్నారు.అసలు ఎలాంటి అంచనాలు లేని హీరోలు.. హిట్లు అందుకుంటూ వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. దీంతో ఏ హీరో మీద భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీయొచ్చు అన్న విషయంలో నార్త్ మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కరోనా మహమ్మారికి ముందు వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో కనిపించారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఎక్స్‌పరిమెRANBEER KAPOOR{#}Karthik;bollywood;ala venkatapuram lo;Remake;News;Success;Ala Vaikunthapurramloo;Coronavirus;Kumaar;India;Cinema;Heroరణబీర్: బాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హిట్ హీరో?రణబీర్: బాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హిట్ హీరో?RANBEER KAPOOR{#}Karthik;bollywood;ala venkatapuram lo;Remake;News;Success;Ala Vaikunthapurramloo;Coronavirus;Kumaar;India;Cinema;HeroSat, 18 Mar 2023 16:22:22 GMTబాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హిట్ల హీరోల లిస్ట్‌ అనేది వెంట వెంటనే మారపోతోంది. ఒక సీజన్‌లో సక్సెస్ ఫుల్‌ హీరో అనిపించుకున్న స్టార్స్‌ నెక్ట్స్ సీజన్‌లో ఫుల్ ఫ్లాపుల్లో పడిపోతున్నారు.అసలు ఎలాంటి అంచనాలు లేని హీరోలు.. హిట్లు అందుకుంటూ వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. దీంతో ఏ హీరో మీద భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీయొచ్చు అన్న విషయంలో నార్త్ మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కరోనా మహమ్మారికి ముందు వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో కనిపించారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఎక్స్‌పరిమెంట్ మూవీస్‌, బయోపిక్స్‌ ఇంకా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌.. ఇలా అన్ని జోనర్లో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టాడు.కానీ ఇప్పుడు మాత్రం అక్షయ్‌ టైమ్ అస్సలు బాలేదు. వరుసగా అతను నటించిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ అవుతూ బోల్తా పడుతుండటంతో అక్షయ్‌ కుమార్ ఇమేజ్‌ డ్యామేజ్ అయ్యింది. అక్షయ్‌ ఫెయిల్ అవుతున్న టైమ్‌లోనే బాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హిట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.


ఎలాంటి బ్యాక్‌ బ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ కష్టాల్లో ఉన్న టైమ్‌లో కూడా బ్లాక్ బస్టర్స్‌తో సత్తా చాటారు. కానీ రీసెంట్‌గా కార్తీక్‌కి కూడా చాలా పెద్ద ఫెయిల్యూర్ ఎదురైంది. సౌత్‌లో సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసిన కార్తీక్ ఆర్యన్ అనుకున్న రేంజ్ సక్సెస్‌ సాధించలేకపోయారు. దీంతో కార్తీక్ ఆర్యన్‌ జోరుకు కూడా గట్టి బ్రేకులు పడ్డాయి.అయితే తాజాగా నార్త్ కు కొత్త సేవియర్‌గా మారారు స్టార్ కిడ్ రణబీర్ కపూర్‌. రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సినిమాతో పర్వాలేదు అనిపించి పాన్ ఇండియా హిట్ అందుకున్న రణబీర్‌… సౌత్‌లో కూడా సాలిడ్ మార్కెట్‌ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా తూ ఝూటీ మై మక్కర్ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో రణబీర్‌ మీదే ఆశలు పెట్టుకుంది బాలీవుడ్‌. ఈ సినిమా ఇప్పటిదాకా 122 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ప్రజెంట్ రణబీర్ నటిస్తున్న యానిమల్ సినిమా విషయంలో కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుండటంతో.. నార్త్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మినిమమ్ గ్యారెంటీ హిట్ హీరో రణబీరే అంటున్నారు విశ్లేషకులు.



RRR Telugu Movie Review Rating

మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న ప్రియా ప్రకాష్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>