Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-ed0230b1-c8d5-4b37-8a80-c31892b54262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-ed0230b1-c8d5-4b37-8a80-c31892b54262-415x250-IndiaHerald.jpgక్రికెట్ అయినా సినిమా అయినా ఇక అభిమానం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడైనా తమ అభిమాన నటుడికి సంబంధించిన సినిమా షూటింగ్ జరుగుతుందంటే.. చాలు ఫ్యాన్స్ భారీగా తరలి వెళ్తూ ఉంటారు. ఇక తమ అభిమాన నటులను చూసేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం సినిమాల్లోనే కాదు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు ఇలాంటిది చేయడం చూస్తూ ఉంటాం. ఒకవేళ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు టికెట్లు దొరకకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని అయినా సరే మ్యాచ్ చూడడానCricket {#}Nepal;Audience;media;Cricket;Cinemaక్రికెట్ పై ఇంత పిచ్చి ఏంటి గురూ.. ప్రాణాల సైతం లెక్కచేయకుండా?క్రికెట్ పై ఇంత పిచ్చి ఏంటి గురూ.. ప్రాణాల సైతం లెక్కచేయకుండా?Cricket {#}Nepal;Audience;media;Cricket;CinemaFri, 17 Mar 2023 15:30:00 GMTక్రికెట్ అయినా సినిమా అయినా  ఇక అభిమానం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడైనా తమ అభిమాన నటుడికి సంబంధించిన సినిమా షూటింగ్ జరుగుతుందంటే.. చాలు ఫ్యాన్స్ భారీగా తరలి వెళ్తూ ఉంటారు. ఇక తమ అభిమాన నటులను చూసేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం సినిమాల్లోనే కాదు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు ఇలాంటిది చేయడం చూస్తూ ఉంటాం. ఒకవేళ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు టికెట్లు దొరకకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని అయినా సరే మ్యాచ్ చూడడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.



 ఇక ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో నేపాల్ లో క్రికెట్ కి ఉన్న ప్రేక్షకాదరణ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ అందరు కూడా ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకొని మరి రిస్కు చేశారు అని చెప్పాలి. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 లో భాగంగా నేపాల్ లోని కీర్తిపూర్ క్రికెట్ గ్రౌండ్లో నేపాల్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ చూడడానికి భారీగా ప్రేక్షకులు పోటెత్తారు. ఎంతలా అంటే కనీసం ఇసుక వేసినా రాలనంత మంది ప్రేక్షకులు స్టేడియంలో నిండిపోయారు.


 ఇక మ్యాచ్ చూడాలనుకున్నప్పటికీ టికెట్ దొరకక నిరాశలో మునిగిపోయిన ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా టికెట్లు దొరకని వారు గ్రౌండ్ బయట ఉన్న భారీ కేడ్ల నుంచి మ్యాచ్ వీక్షించారు. ఏకంగా ప్రాణాలను రిస్క్ లో పెట్టుకొని మరి పెద్ద పెద్ద చెట్లు ఎక్కి మ్యాచ్ను వీక్షించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇది చూసిన ఎంతోమంది క్రీడాభిమానులు క్రికెట్ అంటే ఇంత పిచ్చి ఏంటి గురు అని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అటు యూఏఈ పై నేపాల్ విజయం సాధించింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

పొట్టి డ్రెస్ లో మైమరపిస్తున్న హాట్ బ్యూటీ..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>