MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-thapsic58f01af-58e1-468d-826f-1e57614c9aa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-thapsic58f01af-58e1-468d-826f-1e57614c9aa9-415x250-IndiaHerald.jpg'ఝుమ్మంది నాదం' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది తాప్సి. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ లో సెటిలైపోవడమే కాకుండా అక్కడ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది ఈ ముద్Acctress Thapsi{#}Shahrukh Khan;Gift;Tapsee Pannu;Tollywood;Telugu;bollywood;House;Father;Cinema'అలా మారేందుకు నెలకు లక్ష ఖర్చు పెడుతున్నా.. తాప్సి షాకింగ్ కామెంట్స్..!!'అలా మారేందుకు నెలకు లక్ష ఖర్చు పెడుతున్నా.. తాప్సి షాకింగ్ కామెంట్స్..!!Acctress Thapsi{#}Shahrukh Khan;Gift;Tapsee Pannu;Tollywood;Telugu;bollywood;House;Father;CinemaFri, 17 Mar 2023 17:25:00 GMT'ఝుమ్మంది నాదం' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది తాప్సి. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ లో సెటిలైపోవడమే కాకుండా అక్కడ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. 

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సి తన డైట్ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తానున్న ఈ వృత్తిలో ఎప్పుడు ఫిట్గా ఉండటం కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తానని తెలిపింది. ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుందని.. అంతేకాకుండా శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదని మారిపోతూ ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి తాను డైటీషియన్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది.  తన డైటీషియన్ కోసం ప్రతి నెల లక్ష రూపాయలకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పింది. అంతేకాదు ఈ విషయంలో తన పేరెంట్స్ తో తిట్లు కూడా తింటారని చెప్పింది.

ఇలాంటి ఖర్చులను తన తండ్రి అస్సలు అంగీకరించడని..తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫాదర్స్ డే నాడు తన తండ్రికి పది రూపాయలు పెట్టి ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చానని.. అప్పుడు డబ్బులు వృధా చేసినందుకు తనపై కోపడ్డారని తన చిన్ననాటి విషయాన్ని గుర్తు చేసింది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తన తల్లి ఒప్పుకున్న్నా.. తన తండ్రి మాత్రం ఇంకా మారలేదని ఇప్పుడు కూడా దానిపైనే చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పింది. అయితే ఇదంతా తాను కెరియర్ కోసమే పెడుతున్న పెట్టుబడి అని కూడా చెప్పింది. ఇక ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది తాప్సి. తాజాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'డుంకి' అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది...!!



RRR Telugu Movie Review Rating

పొట్టి డ్రెస్ లో మైమరపిస్తున్న హాట్ బ్యూటీ..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>