SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023-gujarath-jaints-ku-keelaka-match-gelisthene-nilusthundhi4b30b7b5-60fc-445e-91cd-892820a6a43a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023-gujarath-jaints-ku-keelaka-match-gelisthene-nilusthundhi4b30b7b5-60fc-445e-91cd-892820a6a43a-415x250-IndiaHerald.jpgమహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు పాయింట్ల పట్టికలో రెండవ స్థానములో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు అట్టడుగున ఉన్న గుజరాత్ జయింట్స్ లు మ్యాచ్ ను ఆడుతున్నాయి. ఢిల్లీ గెలిచినా ఓడినా పెద్ద ఇబ్బంది లేకపోయినా , గుజరాత్ కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో కనుక ఓడితే ప్లే ఆఫ్ కు చేరడం దాదాపు కష్టం అవుతుంది. WPL-GUJARAT-GIANTS VS DELHI-CAPITALS{#}Allu Sneha;Ram Gopal Varma;Delhi;Gujarat - GandhinagarWPL 2023: గుజరాత్ జయింట్స్ కు కీలక మ్యాచ్.. గెలిస్తేనే నిలుస్తుంది !WPL 2023: గుజరాత్ జయింట్స్ కు కీలక మ్యాచ్.. గెలిస్తేనే నిలుస్తుంది !WPL-GUJARAT-GIANTS VS DELHI-CAPITALS{#}Allu Sneha;Ram Gopal Varma;Delhi;Gujarat - GandhinagarThu, 16 Mar 2023 20:30:00 GMTమహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు పాయింట్ల పట్టికలో రెండవ స్థానములో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు అట్టడుగున ఉన్న గుజరాత్ జయింట్స్ లు మ్యాచ్ ను ఆడుతున్నాయి. ఢిల్లీ గెలిచినా ఓడినా పెద్ద ఇబ్బంది లేకపోయినా , గుజరాత్ కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో కనుక ఓడితే ప్లే ఆఫ్ కు చేరడం దాదాపు కష్టం అవుతుంది. ఇక రేస్ నుండి తొలగిపోయినట్లే అనుకోవాలి... కానీ ఈ మ్యాచ్ తో పాటుగా మూడు మ్యాచ్ లు చేతిలో ఉండగా మూడు గెలిస్తే నాలుగు మ్యాచ్ లు గెలిచినట్లు అవుతుంది. అప్పుడు గుజరాత్ పోటీలో ఉండే అవకాశం ఉంది.

ఈ సీజన్ ను గుజరాత్ సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేయాలి అనుకున్నా... మొదటి మ్యాచ్ లోనే ఫామ్ లో  ఉన్న కీలక ప్లేయర్ మరియు గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా సీజన్ కు దూరం అయింది. అక్కడ నుండి అటు టీం యాజమాన్యంతో పాటుగా ప్లేయర్స్ సైతం ఢీలా పడిపోయారు. అలా ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్ లలో కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం స్నేహ రానా కెప్టెన్ గా వ్యవహరిస్తూ అనుభవలేమితో జట్టును ముందు నడిపిస్తోంది. కాగా ఈ రోజు టాస్ ఓడిన గుజరాత్ మొదటి బ్యాటింగ్ చేస్తోంది. జట్టు మొత్తముగా చూస్తే సమతూకంగా ఉన్నా సమిష్టిగా ప్రదర్శన చేయడంలో విఫలం అవుతున్నారు.

ఢిల్లీ లాంటి జట్టుపైన గెలవాలంటే కనీసం 170 పరుగులు అయినా చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ బాటింగ్ లైన్ అప్ ఎంత దుర్భేద్యంగా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా లానింగ్ , షెపాలి వర్మ , కప్, క్యాప్సి లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లోనూ రాణిస్తూ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి మరొక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటారా ?
   



RRR Telugu Movie Review Rating

ఏంటి పవన్ సినిమా.. సమ్మర్ రిలీజ్ అంటే నమ్మాలా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>