MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-japan-20-weeksef467230-fbca-450b-8d67-6049de7ed715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-japan-20-weeksef467230-fbca-450b-8d67-6049de7ed715-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం ఆనందోత్సాహాల్లో మునిగి తెలుస్తున్నారు అని చెప్పాలి. తాజాగా జరిగిన 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని "నాటు నాటు... " పాటకు ఈ అవార్డు వరించడం విశేషం. ఈ అవార్డు తో ప్రపంచం అంతా ఇండియా సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటోంది. RRR-JAPAN-20-WEEKS{#}Muthu;Japan;Rajamouli;Jr NTR;Ram Charan Teja;October;cinema theater;Oscar;Darsakudu;Success;Indian;India;Director;Cinemaజయహో "ఆర్ ఆర్ ఆర్": థియేటర్ లలో 20 వారాలు.. స్టిల్ నాట్ అవుట్ !జయహో "ఆర్ ఆర్ ఆర్": థియేటర్ లలో 20 వారాలు.. స్టిల్ నాట్ అవుట్ !RRR-JAPAN-20-WEEKS{#}Muthu;Japan;Rajamouli;Jr NTR;Ram Charan Teja;October;cinema theater;Oscar;Darsakudu;Success;Indian;India;Director;CinemaThu, 16 Mar 2023 19:41:38 GMTపాన్ ఇండియా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం ఆనందోత్సాహాల్లో మునిగి తెలుస్తున్నారు అని చెప్పాలి. తాజాగా జరిగిన 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని "నాటు నాటు... " పాటకు ఈ అవార్డు వరించడం విశేషం. ఈ అవార్డు తో ప్రపంచం అంతా ఇండియా సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటోంది. ఇక ఇండియాలో అయితే ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరినీ ఎంతగానో పొగుడుతున్నారు. ఈ సినిమాను ఎంతో గొప్పగా , అద్భుతంగా చెక్కిన జక్కన్న రాజమౌళి , దర్శకుడు చెప్పినట్లుగా నటించి ఇంతటి సక్సెస్ కు కారణం అయిన నటీనటులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక  ఇందులో ప్రధానపాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తేజ్ లు కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కాగా ఈ సినిమాను జపాన్ దేశంలో అక్టోబర్ 21 లో రిలీజ్ చేశారు... అయితే అక్కడ ఇప్పటికి 20 వారాలు కావస్తున్నా రెండు వందల థియేటర్ లలో ప్రదర్శించబడడం గొప్ప విషయంగా ట్రేడ్ పండితులు మరియు సినిమా వర్గాలు భావిస్తున్నారు. ఇప్పుడు సినిమాలు థియేటర్ లో మూడు వారాలు ఆడితే గొప్ప, ఇక హిట్ సినిమాలు అయితే 50 రోజులు ఆడడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాంటిది "ఆర్ ఆర్ ఆర్" సినిమా మాత్రం ఇరవై వారాలుగా ఆడుతోంది.

అంటే... శతదినోత్సవం పూర్తి అయ్యాక కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇండియన్ సినిమా కూడా జపాన్ లో ఈ స్థాయిలో రన్ అయింది లేదు. గతంలో ముత్తు సినిమా ఒక్కటే... 400 మిలియన్ యాన్ లను కలెక్ట్ చేసింది. కానీ ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఇప్పటికే వెయ్యి మిలియన్ యాన్ లను అందుకుంది. ఇంకా ఎన్ని రోజులు జపాన్ లో ఈ సినిమా ప్రదర్శితం అవుతుందన్నది చూడాల్సి ఉంది.  



RRR Telugu Movie Review Rating

ఏంటి పవన్ సినిమా.. సమ్మర్ రిలీజ్ అంటే నమ్మాలా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>