EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/avinash-reddy7df70263-6817-40c0-9b3f-226fea3d9f5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/avinash-reddy7df70263-6817-40c0-9b3f-226fea3d9f5f-415x250-IndiaHerald.jpgతెలంగాణ హైకోర్టులో సిబిఐ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని కోర్టుకు సమర్పించింది. అవినాష్ ఉదంతం పై తమ వాదనలను వినిపించింది. దీనిపై సిబిఐ ఒక సీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. సాక్షుల నుంచి ఇంకా అనుమానితుల నుంచి సేకరించిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ విచారణకు సంబంధించిన కొన్ని టేపులను సమర్పించామని, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణను రికార్డు చేస్తున్నామని, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను తోసిపారేయలేమని సిబిఐ కోర్టుకు చెప్పిందిAVINASH REDDY{#}Lawyer;avinash;Hyderabad;Father;court;Murder.;devineni avinash;Y S Vivekananda Reddy;CBI;MP;Reddy;Letter;bhaskar;Baba Bhaskar;marriageఅవినాష్ రెడ్డి విచారణ.. జగన్‌కు ఝలక్‌ తప్పదా?అవినాష్ రెడ్డి విచారణ.. జగన్‌కు ఝలక్‌ తప్పదా?AVINASH REDDY{#}Lawyer;avinash;Hyderabad;Father;court;Murder.;devineni avinash;Y S Vivekananda Reddy;CBI;MP;Reddy;Letter;bhaskar;Baba Bhaskar;marriageThu, 16 Mar 2023 09:00:00 GMTతెలంగాణ హైకోర్టులో సిబిఐ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని కోర్టుకు సమర్పించింది. అవినాష్ ఉదంతం పై తమ వాదనలను వినిపించింది. దీనిపై సిబిఐ ఒక సీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. సాక్షుల నుంచి ఇంకా అనుమానితుల నుంచి సేకరించిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ విచారణకు సంబంధించిన కొన్ని టేపులను సమర్పించామని,  ఎంపీ అవినాష్ రెడ్డి విచారణను రికార్డు చేస్తున్నామని, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో  ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను తోసిపారేయలేమని సిబిఐ కోర్టుకు చెప్పింది.


ఎంపీ అవినాష్ రెడ్డి కోరుతున్నట్టుగా ఇందులో వేరే వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటి కోణంలో కూడా విచారించాలి, ఆయనకు రెండో పెళ్లి వ్యవహారం గురించి ఆస్తి, ఆ డాక్యుమెంట్ల గురించి కూడా విచారించాలి, ఆ రూట్లో విచారించారా? లేదు అంటే సిబీఐ ని నువ్వు ఇట్లా విచారించు అని కోర్టు చెప్పింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా విచారించాలని  కోర్టు సిబిఐ ని కోరింది.


ఆ తర్వాత, హైదరాబాద్‌ లో  విచారణ జరగాల్సి ఉన్నప్పుడు మీరు కడపలో భాస్కర్ రెడ్డిని ఎందుకు విచారించారు అని కోర్టు సిబిఐ ని ప్రశ్నించింది. దానికి సిబిఐ సమాధానం ఇస్తూ  భాస్కర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరలేదని కోర్టుకు తెలిపింది. విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాసినా కూడా, నాలుగో విడత విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి వచ్చింది.  


న్యాయవాది సమక్షంలో అక్కడ విచారణ జరిగింది. దాదాపు 4గంటలు కేసులోని ముఖ్యమైన విషయాలను విచారించిన తర్వాత ఆయనను పంపేశారు. వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తున్న నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. మొత్తం మీద అవినాశ్ కేసులో జగన్‌కు ఝలక్‌ తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>