Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/appatlone-international-award-gelchukunna-mana-telugu-cinemalu123ab4ec-861a-47de-b5a3-3b517992a5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/appatlone-international-award-gelchukunna-mana-telugu-cinemalu123ab4ec-861a-47de-b5a3-3b517992a5bc-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ప్రేక్షకులు ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాజమౌళి చెక్కిన RRR సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ వేదికగా కాలరెగరేసింది.టాలీవుడ్ ప్రభ ఒక్కసారిగా ప్రపంచ సినిమాపై మెరిసింది. అయితే ఇలా టాలీవుడ్కు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడం ఇదే తొలిసారి కాదు. " మల్లీశ్వరి" :: రఘుపతి వెంకయ్య నాయుుడు చేతుల్లో పుట్టిన తెలుగు సినిమా 1931 నాటికి HM రెడ్డి వద్ద మాటలు నేర్చింది.భక్త ప్రహ్లాద పేరుతో విడుదలైన ఆ సినిమా తరువాత ఎందరో దిగ్గజాలు సినీరంగం వైపు వచ్చేలా Socialstars lifestyle {#}Nagesh Kukunoor;Ram Gopal Varma;chakravarthy;krishna;Spain;Switzerland;Mohandas Karamchand Gandhi;Moscow;venkaiah naidu;Nartanasala;Akkineni Nageswara Rao;Maya bazar;Sakshi;Bapu;Beijing;American Samoa;london;marriage;vishwa;INTERNATIONAL;RRR;Tollywood;sekhar;Hindi;Director;India;Reddy;Industry;NTR;Rajamouli;RRR Movie;Oscar;Telugu;Cinemaఅప్పట్లోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన మన తెలుగు సినిమాలు....!!అప్పట్లోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన మన తెలుగు సినిమాలు....!!Socialstars lifestyle {#}Nagesh Kukunoor;Ram Gopal Varma;chakravarthy;krishna;Spain;Switzerland;Mohandas Karamchand Gandhi;Moscow;venkaiah naidu;Nartanasala;Akkineni Nageswara Rao;Maya bazar;Sakshi;Bapu;Beijing;American Samoa;london;marriage;vishwa;INTERNATIONAL;RRR;Tollywood;sekhar;Hindi;Director;India;Reddy;Industry;NTR;Rajamouli;RRR Movie;Oscar;Telugu;CinemaWed, 15 Mar 2023 10:14:55 GMTతెలుగు సినిమా ప్రేక్షకులు ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాజమౌళి చెక్కిన rrr సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ వేదికగా కాలరెగరేసింది.టాలీవుడ్ ప్రభ ఒక్కసారిగా ప్రపంచ సినిమాపై మెరిసింది. అయితే ఇలా టాలీవుడ్కు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడం ఇదే తొలిసారి కాదు.

 " మల్లీశ్వరి" ::

రఘుపతి వెంకయ్య నాయుుడు చేతుల్లో పుట్టిన తెలుగు సినిమా 1931 నాటికి HM రెడ్డి వద్ద మాటలు నేర్చింది.భక్త ప్రహ్లాద పేరుతో విడుదలైన ఆ సినిమా తరువాత ఎందరో దిగ్గజాలు సినీరంగం వైపు వచ్చేలా స్ఫూర్తినిచ్చింది. వారిలో ఒకరైన BN రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమానే మల్లీశ్వరి. 1951 లో రిలీజైన ఆ సినిమా నాటి రికార్డులను బద్దలు కొట్టడమే కాక..విమర్శకుల మార్కులు కొట్టేసింది.దానితో 1953 లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్ళ తో రిలీజ్ అయింది . ఆరోజుల్లో ఒక తెలుగు సినిమా చైనా లో 13 ప్రింట్లతో షోస్ పడడం అనేది ఊహకు కూడా అందని విశేషం. అంతే కాదు అదే సినిమా 16mm తెర మీద అమెరికా లో కూడా ప్రదర్శించ బడింది . ఆ తరువాత 1957 లో రిలీజ్ అయిన మాయా బజార్ IBN వాళ్ళు 2013లో నిర్వహించిన పోల్ లో భారత దేశపు అతి గొప్ప చిత్రాల్లో మొదటి స్థానం లో నిలిచింది.

'నర్తనశాల' ::

1963 లో రిలీజైన నర్తనశాల సినిమా ఎంత పెద్ద హిట్ అంటే బెంగాలీ,ఒడియా భాషల్లోకి సైతం డబ్ అయింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇండోనేషియా లో జరిగిన ఆఫ్రో_ ఏషియన్ ఫెస్టివల్ లో రెండు అవార్డులను పొందింది. ఆ సినిమా లో కీచకుడు పాత్ర పోషించిన విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కు ఉత్తమ నటుడు అవార్డు లభిస్తే ఆర్ట్ డైరెక్టర్ TVS శర్మ కు ఆ విభాగం లో అవార్డ్ వచ్చింది.

ఎన్టీఆర్, ఏయాన్నార్ సినిమాలు ::

అంతకు మూడేళ్ల ముందు 1960 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆదుర్తి వారి సినిమా ‘నమ్మినబంటు’ను స్పెయిన్ లో జరిగిన సాన్- సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అలాగే 1967 లో రిలీజైన ntr సినిమా ఉమ్మడి కుటుంబం ను భారత దేశం తరపున మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారిక ఎంట్రీ గా పంపారు.ఇక 1968 లో అయితే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన క్లాసిక్ సుడిగుండాలు బాపు తొలిసారి దర్శకత్వం వహించిన కృష్ణ నటించిన సాక్షి సినిమాలను తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షో లు వేశారు.బాపు దర్శత్వంలోనే 1976 వచ్చిన సీతా కళ్యాణం సినిమాను లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ చికాగో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించడం తో పాటు బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక పాఠం గా కూడా పెట్టారు.

'  క్షణక్షణం ' ::

‘శివ’ లాంటి ఇండస్ట్రీ హిట్ తో వెలుగు లోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ తో నిర్మించిన ‘క్షణక్షణం’ ఒక కల్ట్ క్లాసిక్ అయింది. ఈ సినిమాను హిందీ లోకి ‘హైరానా’ పేరుతో డబ్ చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా..క్లియర్ కట్ రోడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అమెరికా లోని మిచెగన్ రాష్ట్రం లో జరిగే ANN -ARBOR ఫిల్మ్ ఫెస్టివల్ , స్విట్జర్లాండ్ లో జరిగే FRIBOURG ఫిల్మ్ ఫెస్టివల్ ప్రశంసలు పొందింది. ఇవి మాత్రమే కాకుండా శేఖర్ కమ్ముల డాలర్ ‘డ్రీమ్స్’, నగేష్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, 2006లో రజనేష్ దోమలపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘వనజ’ లాంటి సినిమాలతో పాటు రాజమౌళి ‘ఈగ’ కూడా అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు పొందాయి. కాబట్టి RRRకు వచ్చిన ఆస్కార్ మాత్రమే టాలీవుడ్ కు వచ్చిన అంతర్జాతీయ అవార్డ్ గా భావించలేం. కానీ, ‘‘నాటు నాటు’’కు వచ్చిన ఆస్కార్ అవార్డ్ రీసౌండ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని అవార్డుల కంటే ఘనంగా మోగింది అది సబబే కూడా!



RRR Telugu Movie Review Rating

యువకుడి కడుపులో 55 బ్లేడ్లు.. డాక్టర్లు ఏం చేశారంటే?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>