MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకాజల్ పెళ్ళి తరువాత తల్లి అయినప్పటికీ పెద్దగా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన ఫిజిక్ ను మళ్ళీ పూర్తిగా సెట్ చేసుకుని టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. ఆ సంకేతాలు అందిపుచ్చుకున్న అనీల్ రావిపూడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణతో తాను తీస్తున్న మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేసాడు.త్వరలో ఆమె బాలకృష్ణ పక్కన నటించే సీన్స్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమూవీ ఫలితం బట్టి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కాజల్ పేరు చెపితే మెగా అభిమానులు మండిపడKAJAL{#}Balakrishna;Ram Charan Teja;anil ravipudi;kajal aggarwal;Jr NTR;News;Heroine;Tollywood;Rajamouli;Oscar;Cinemaకాజల్ పై మెగా అభిమానుల అసహనం !కాజల్ పై మెగా అభిమానుల అసహనం !KAJAL{#}Balakrishna;Ram Charan Teja;anil ravipudi;kajal aggarwal;Jr NTR;News;Heroine;Tollywood;Rajamouli;Oscar;CinemaWed, 15 Mar 2023 08:23:28 GMTకాజల్ పెళ్ళి తరువాత తల్లి అయినప్పటికీ పెద్దగా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన ఫిజిక్ ను మళ్ళీ పూర్తిగా సెట్ చేసుకుని టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. ఆ సంకేతాలు అందిపుచ్చుకున్న అనీల్ రావిపూడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణతో తాను తీస్తున్న మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేసాడు.


త్వరలో ఆమె బాలకృష్ణ పక్కన నటించే సీన్స్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమూవీ ఫలితం బట్టి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కాజల్ పేరు చెపితే మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనికి కారణం ఆమె లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఒక కామెంట్. ‘ఆర్ ఆర్ ఆర్’ లో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను అభినందిస్తూ ముఖ్యంగా రాజమౌళి చరణ్ జూనియర్ కీరవాణి లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.


అయితే ఈవిషయంలో కాజల్ వ్యవహరించిన తీరు మెగా అభిమానులకు తీవ్ర అసంతృప్తిని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ తన అభినందనలను తెలియచేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు అభినందనలు’ అంటూ మెసేజ్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు చేతిలో పెట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే చరణ్ ఆస్కార్ అవార్డును చేతిలో పెట్టుకుని తీయించుకున్న ఫోటోను కాజల్ ఎందుకు షేర్ చేయలేదు అంటూ మెగా అభిమానులు ఆమెను కార్నర్ చేస్తున్నారు.


అంతేకాదు కాజల్ కు టాప్ హీరోయిన్ రేంజ్ ని ‘మగధీర’ సినిమాతో కలిగించిన రామ్ చరణ్ రాజమౌళి లను ఆమె మర్చిపోయిందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈవిషయమై మరికొందరి వాదన మరో విధంగా ఉంది. ‘ఆచార్య’ మూవీలో కాజల్ చిరంజీవి పక్కన హీరొయిన్ గా నటిస్తే కనీసం ఆమెకు చెప్పకుండా ఆమె పాత్రను పూర్తిగా ‘ఆచార్య’ మూవీ నుండి తొలగించడంతో అసహనానికి లోనైన కాజల్ ఇలా ప్రవర్తించి ఉంటుంది అంటు మరికొందరి విశ్లేషణ..







RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ఆశలు ఎవరిమీద పెట్టుకున్నారో తెలుసా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>