MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt7ffddd53-422c-4dec-a585-f9da249391e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt7ffddd53-422c-4dec-a585-f9da249391e0-415x250-IndiaHerald.jpg చిన్న వయసులోనే తన నటనతో బాలీవుడ్‌లో సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అలియా భట్. నేడు ఆమె పుట్టినరోజు నేడు. అలియాకు ఈ రోజుతో సరిగ్గా 30 ఏళ్లు నిండాయి.ఇక 1993 మార్చి 15న జన్మించిన అలియా భట్ కు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుని కూతురు రాహాకు జన్మనిచ్చిన తర్వాత అలియాకి ఇదే తనకి మొదటి పుట్టినరోజు కాబట్టి. గత సంవత్సరం రణబీర్ కపూర్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. అలియా ఆరేళ్ల వయసులో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఈ రోజALIA BHATT{#}Mahesh Bhatt;Rajani kanth;Allu Ayaan;Prema Katha;Pooja Hegde;Coffee;producer;Producer;marriage;Father;Chitram;Love;Karan Johar;Alia Bhatt;Hero;Heroine;Director;Cinema;bollywood;Marchఅలియా భట్ బర్త్ డే స్పెషల్: అలియా ప్రేమకథ ఇదే?అలియా భట్ బర్త్ డే స్పెషల్: అలియా ప్రేమకథ ఇదే?ALIA BHATT{#}Mahesh Bhatt;Rajani kanth;Allu Ayaan;Prema Katha;Pooja Hegde;Coffee;producer;Producer;marriage;Father;Chitram;Love;Karan Johar;Alia Bhatt;Hero;Heroine;Director;Cinema;bollywood;MarchWed, 15 Mar 2023 15:50:00 GMT చిన్న వయసులోనే తన నటనతో బాలీవుడ్‌లో సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అలియా భట్. నేడు ఆమె పుట్టినరోజు నేడు. అలియాకు ఈ రోజుతో సరిగ్గా 30 ఏళ్లు నిండాయి.ఇక 1993 మార్చి 15న జన్మించిన అలియా భట్ కు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుని కూతురు రాహాకు జన్మనిచ్చిన తర్వాత అలియాకి ఇదే తనకి మొదటి పుట్టినరోజు కాబట్టి. గత సంవత్సరం రణబీర్ కపూర్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. అలియా ఆరేళ్ల వయసులో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఈ రోజు అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.చిన్నప్పటి నుంచి కూడా అలియా భట్‌కి తన సోదరి పూజా భట్‌లాగా హీరోయిన్ గా మారడం అంటే ఇష్టంగా ఉంది. అలియా భట్ బాలీవుడ్ స్టార్ నిర్మాత-దర్శకుడు అయిన మహేష్ భట్ కుమార్తె కావడంతో ఆమెకు నటన అనేది తన రక్తంలోనే ఇమిడిపోయింది. అలియా భట్ తొలిసారిగా 1999 వ సంవత్సరంలో తన తండ్రి థ్రిల్లర్ చిత్రం 'సంఘర్ష్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపై కనిపించింది. ఆ సినిమా సమయంలో అలియా వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే.


ఇక నటిగా ఆమె కెరీర్ మాత్రం 2012 సంవత్సరంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా కోసం, 400 నుండి 500 మంది అమ్మాయిలను ఆడిషన్ చేయగా అలియా భట్ అందులో ఒకరిగా సెలక్ట్ అయింది.ఆమె ఆ పాత్ర కోసం ఎంపికయ్యాక ఏకంగా 16 కిలోలు తగ్గింది. అలియా కెరీర్‌లో ఇప్పటి దాకా 'హైవే', 'ఉడ్తా పంజాబ్', 'రాజీ', 'గల్లీ బాయ్', 'గంగూబాయి కతియావాడి' వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ఇక అలియా భట్ ఇంకా రణబీర్ ల ప్రేమ కథ గురించి చెప్పాలంటే వారి ప్రేమ కథ సినిమా స్క్రిప్ట్ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రణబీర్, అలియా కంటే వయసులో ఏకంగా 11 ఏళ్ల పెద్దవాడు.అయితే నిజాయితీగా లవ్ చేసికొని పెళ్లితో ఒక్కటయ్యి ఏజ్ ఒక నెంబర్ మాత్రమేనని వీరు నిరూపించారు.అలియా భట్ రన్ బీర్ కి పెద్ద ఫ్యాన్.. ఈ విషయం తను 2014 లో కాఫీ విత్ కరణ్ లో తెలిపింది. అంతేకాదు తనకు స్వయం వరం పెడితే రణ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక అయాన్ ముఖర్జి ద్వారా బ్రహ్మస్త్ర షూటింగ్ లో రణ బీర్ కి పరిచయం అయ్యింది. అలా ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.



RRR Telugu Movie Review Rating

అందుకే యాంకర్ రవి పెళ్లిని సీక్రెట్ గా ఉంచారు..!!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>