Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-252adff3-e380-43cd-b635-e5c84b2733c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-252adff3-e380-43cd-b635-e5c84b2733c4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా, ఓ పెద్ద హీరోగా ఉండటమే కాకుండా తనది నిజంగానే పెద్ద మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను సినిమాల్లో ఓస్థాయికి ఎదిగిన తర్వాత అతడు చేసినన్ని విరాళాలు, సమాజానికి చేసిన సేవ మరే ఇతర హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఐతే తాజాగ ఓ సీనియర్ నటుడి చికిత్సకు సాయం చేసి వార్తల్లో నిలిచాడు.ఆ సీనియర్ నటుడి పేరు పొన్నంబలం. 1980, 1990లలో నెగటివ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించాడు ఈ తమిళ నటుడ. అతడు కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. పొన్నంబSocialstars lifestyle {#}devaraj;Service;Smart phone;Industry;Hero;Athadu;Chiranjeevi;Tamilఆ విషయంలో మెగాస్టార్ తర్వాతే :: పొన్నాంబళంఆ విషయంలో మెగాస్టార్ తర్వాతే :: పొన్నాంబళంSocialstars lifestyle {#}devaraj;Service;Smart phone;Industry;Hero;Athadu;Chiranjeevi;TamilWed, 15 Mar 2023 23:23:40 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా, ఓ పెద్ద హీరోగా ఉండటమే కాకుండా తనది నిజంగానే పెద్ద మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను సినిమాల్లో ఓస్థాయికి ఎదిగిన తర్వాత అతడు చేసినన్ని విరాళాలు, సమాజానికి చేసిన సేవ మరే ఇతర హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు.

ఐతే తాజాగ ఓ సీనియర్ నటుడి చికిత్సకు సాయం చేసి వార్తల్లో నిలిచాడు.ఆ సీనియర్ నటుడి పేరు పొన్నంబలం. 1980, 1990లలో నెగటివ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించాడు ఈ తమిళ నటుడ. అతడు కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. పొన్నంబలం కిడ్నీ ఫెయిలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని సాయం అడగాలో అతనికి తెలియలేదు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే అతనికి సాయం చేశాడు.పొన్నంబలంకు ఆ వెంటనే అపోలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. తన రిపోర్టులను తీసుకొని రావాల్సిందిగా వాళ్లు అడిగారు. చిరంజీవి తనకు తోచినంత సాయం చేస్తాడని సదరు నటుడు భావించాడు. కానీ చిరు ఏకంగా హాస్పిటల్ మొత్తం బిల్లయిన రూ.45 లక్షలు చెల్లించడం గమనార్హం. హాస్పిటల్లోకి వెళ్లేందుకు కూడా పొన్నంబలం నుంచి ఫీజు వసూలు చేయలేదు.

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పొన్నంబలం ఈ విషయాన్ని వెల్లడించాడు. నిజానికి అతడు చెప్పే వరకూ ఈ విషయం చాలా మందికి తెలియదు. పొన్నంబలం చెప్పిన తర్వాత మరోసారి చిరంజీవి పెద్ద మనసు తెలుసుకొని అతన్ని అభినందిస్తున్నారు. ఈ మధ్యే ఓ సినిమాటోగ్రాఫర్ కు కూడా చిరంజీవి సాయం చేసిన విషయం తెలిసిందే.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేవరాజ్ అనే సినిమాటోగ్రాఫర్ కు చిరు రూ.5 లక్షల చెక్కు అందించారు. దేవరాజ్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే తనకు తోచిన సాయం చేయాలని నిర్ణయించారు. చిరంజీవి నటించిన నాగు సినిమాకు కూడా దేవరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.

ఈ విషయంలో మెగా అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా మెగాస్టర్ ని మెచ్చుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

' కమల్ హాసన్' ఆస్కార్ కోసం ఎదురుచూసిన సినిమాలు....!!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>