BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautydce422e5-628b-42c7-99be-490c2539f777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautydce422e5-628b-42c7-99be-490c2539f777-415x250-IndiaHerald.jpgఇక పాలను తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పాలు చాలా బాగా సహాయపడతాయి. పాలతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఇంకా మృతకణాలు తొలగించవచ్చు. అలాగే ముఖంపై ఉండే నలుపు కూడా తొలగిపోయి ముఖం అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. అయితే పాలను ఏ విధంగా ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచోకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టమాట రసంBEAUTY{#}Rasam;Manamపాలతో ఇలా చేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది?పాలతో ఇలా చేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది?BEAUTY{#}Rasam;ManamWed, 15 Mar 2023 13:34:40 GMTఇక పాలను తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పాలు చాలా బాగా సహాయపడతాయి. పాలతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఇంకా మృతకణాలు తొలగించవచ్చు. అలాగే ముఖంపై ఉండే నలుపు కూడా తొలగిపోయి ముఖం అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. అయితే పాలను ఏ విధంగా ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచోకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టమాట రసం వేసి కలపాలి. ఇంకా ఆ తరువాత ఇందులో ఫేస్‌ ప్యాక్ కు సరిపడా పచ్చి పాలను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని నీటితో బాగా శుభ్రంగా కడగాలి. తరువాత నిమ్మచెక్కను పంచదారలో ముంచి పంచదారతో ముఖాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి.


ఇలా స్క్రబ్ చేసుకున్న 5 నిమిషాల తరువాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.తరువాత ముందుగా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి రాసుకుని సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి. ఇది ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా పాలతో చేసిన ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు ఈజీగా తొలగిపోతాయి.అలాగే ముఖంపై ఉండే జిడ్డు కూడా తొలగిపోయి ముఖం చాలా అందంగా ఇంకా అలాగే కాంతివంతంగా కూడా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు చాలా ఈజీగా తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. ఇంకా అలాగే చర్మానికి కావల్సిన పోషకాలు అంది చర్మ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను మన ముఖానికి వేసుకున్నప్పుడు ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా మన ముఖాన్ని చాలా అందంగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఎట్టకేలకు తన పారితోషకాన్ని బయటపెట్టిన పవన్..!!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>