EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/natu-natu8b971796-af90-403b-922c-e33a2013c089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/natu-natu8b971796-af90-403b-922c-e33a2013c089-415x250-IndiaHerald.jpgబ్రిటన్ లోని తెల్లవారితో మన రాజమౌళి శెభాష్ అనిపించేలా చేశారు. ఆర్ఆర్ఆర్ విజయం తెల్లవారి గడ్డపై తెలుగు వారు సాధించిన విజయంగా చెప్పొచ్చు. భారత దేశంలో రాజుల మధ్య ఉన్న విబేధాలను అడ్డుపెట్టుకుని దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు ఏలినటువంటి వారు బ్రిటిషర్లు. దేశంలో వారు చేయని అరాచకాలు, అన్యాయాలు లేవు. ఎంతో మంది పోరాట వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే గాని స్వేచ్ఛగా బతికే అవకాశం భారతీయులకు రాలేదు. అలాంటి బ్రిటిష్ గడ్డపై నాటు నాటు పాటకు మనోళ్లు వారితో స్టెప్పులేయించారు. అల్లూరి సీతారామNATU NATU{#}Rajamouli;Alluri Sitarama Raju;RRR Movie;Cinema;Telugu;war;Oscar;ManamRRR: దేశం గర్వపడేలా చేసిన రాజమౌళిRRR: దేశం గర్వపడేలా చేసిన రాజమౌళిNATU NATU{#}Rajamouli;Alluri Sitarama Raju;RRR Movie;Cinema;Telugu;war;Oscar;ManamWed, 15 Mar 2023 06:17:31 GMTబ్రిటన్ లోని తెల్లవారితో మన రాజమౌళి శెభాష్ అనిపించేలా చేశారు. ఆర్ఆర్ఆర్ విజయం తెల్లవారి గడ్డపై తెలుగు వారు సాధించిన విజయంగా చెప్పొచ్చు. భారత దేశంలో రాజుల మధ్య ఉన్న విబేధాలను అడ్డుపెట్టుకుని దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు ఏలినటువంటి వారు బ్రిటిషర్లు. దేశంలో వారు చేయని అరాచకాలు, అన్యాయాలు లేవు. ఎంతో మంది పోరాట వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే గాని స్వేచ్ఛగా బతికే అవకాశం భారతీయులకు రాలేదు. అలాంటి బ్రిటిష్ గడ్డపై నాటు నాటు పాటకు మనోళ్లు వారితో స్టెప్పులేయించారు.


అల్లూరి సీతారామరాజు, కొమురం భీం అసలు పాత్రదారులు కాకుండా వారి పేర్లతో మాత్రమే తీసిన సినిమా అని రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే కొన్ని వివాదాలు సినిమా రాకముందు ఏర్పడటంతో ఆ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. బ్రిటిష్ వారు మనకు అవార్డులు రానివ్వరు. వారిపైన మనం విజయం సాధిస్తే తట్టుకోలేరు. కానీ అలాంటి వారు ప్రస్తుతం మారినట్లు కనిపిస్తున్నారు. బ్రిటిషోళ్లను ఓడించడమే నాటు నాటు పాటలోని ఆంతర్యం.


వెస్టర్న్ కల్చర్ డ్యాన్స్ గెలుస్తుందా.. అచ్చ తెలుగు నాటు నాటు తో చేసే నృత్యం అందరినీ ఆకట్టుకుంటుందా అనే కాన్సెప్ట్ తో చేసిన ఈ డ్యాన్స్ ఫైట్ ఇటు సినిమాలో తెల్లొళ్లను ఓడించింది. అటు ఆస్కార్ అవార్డుల చెంతన గెలిచి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఆస్కార్ రావడం భారతీయులుగా అందరినీ ఎంతో గర్వపడేలా చేసింది. తెల్లజాతీయుల మీద యుద్ధం చేసే ఇద్దరి పోరాట వీరుల మీద తీసిన సినిమాకు ఇంతటి గొప్ప అవార్డు రావడం దేశం ఆనందంలో మునిగిపోయింది.  


బ్రిటిషర్ల మీద నిజమైన పోరాటాలు సాగించిన వారి మనసులు కూడా  ఉప్పొంగి ఉంటాయి. ఎందుకంటే ఎవరి చేతనైతే అణిచి వేయబడ్డామో.. వారితోనే శెబాష్ అనిపించుకుని ఆస్కార్ అవార్డు పొందేలా చేసి ఆర్ఆర్ఆర్ చరిత్రను తిరగరాసింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ఆశలు ఎవరిమీద పెట్టుకున్నారో తెలుసా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>