MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntra1b8a5af-0bf8-4d8e-bf9c-93fa01b1e40b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntra1b8a5af-0bf8-4d8e-bf9c-93fa01b1e40b-415x250-IndiaHerald.jpgసినిమాల పై విపరీతమైన మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ కు గాడ్ ఫాదర్ లేరు. అయినప్పటికీ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అదేవిధంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈయంగ్ హీరో చాల త్వరగా యూత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఒక స్థాయిలో ఇతడు విజయ్ దేవరకొండకు పోటీ అవుతాడా అన్నసందేహాలు కూడ వచ్చాయి.ఇతడు తీసిన ‘ఫలక్ నుమా దాస్’ విజవంతం కావడంతో అతడి పై అంచనాలు పెరిగాయి. అయితే ఆమూవీ తరువాత విడుదలైన అతడి సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ అతడి కెరియర్ కు చిన్న గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్టJUNIOR NTR{#}December;Joseph Vijay;Viswak sen;Nijam;Athadu;God Father;Hero;media;News;Event;Jr NTR;Cinema;Oscarవిశ్వక్ సేన్ యాక్షన్ ప్లాన్ కు జూనియర్ సపోర్ట్ !విశ్వక్ సేన్ యాక్షన్ ప్లాన్ కు జూనియర్ సపోర్ట్ !JUNIOR NTR{#}December;Joseph Vijay;Viswak sen;Nijam;Athadu;God Father;Hero;media;News;Event;Jr NTR;Cinema;OscarTue, 14 Mar 2023 11:00:00 GMTసినిమాల పై విపరీతమైన మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ కు గాడ్ ఫాదర్ లేరు. అయినప్పటికీ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అదేవిధంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈయంగ్ హీరో చాల త్వరగా యూత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఒక స్థాయిలో ఇతడు విజయ్ దేవరకొండకు పోటీ అవుతాడా అన్నసందేహాలు కూడ వచ్చాయి.


ఇతడు తీసిన ‘ఫలక్ నుమా దాస్’ విజవంతం కావడంతో అతడి పై అంచనాలు పెరిగాయి. అయితే ఆమూవీ తరువాత విడుదలైన అతడి సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ అతడి కెరియర్ కు చిన్న గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా అతడు నటించిన ‘ధమ్కీ’ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈమూవీకి అతడే స్వీయ దర్శకత్వం చేసుకుంటే అతడి నిర్మాతగా వ్యవహరించాడు.


అయితే ఈ మూవీ కథకు క్రితం సంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘ధమాకా’ మూవీ కథకు పోలికలు ఉండటంతో ఈమూవీ కథలో చాల మార్పులు చేసారు. ఇప్పుడు ఈ రీషూట్ అంతా పూర్తి కావడంతో రాబోతున్న ‘ఉగాది’ రోజున ఈమూవీని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈవార్తలే నిజం అయితే ఆస్కార్ అవార్డుల ఈవెంట్ తరువాత తారక్ పాల్గొనే మొట్టమొదటి పబ్లిక్ ఈవెంట్ ఇది కాబోతోంది. దీనితో అభిమానుల తాకిడితో పాటు మీడియా కవరేజ్ కూడ ఈ ఫంక్షన్ కు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. దీనితో ఈమూవీకి పరోక్షంగా జూనియర్ ఇమేజ్ సహకరించే ఆస్కారం ఉంది. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమైపోతున్న విశ్వక్ సేన్ కోరుకున్న హిట్ ఈమూవీ ఇవ్వగలిగితే రెట్టించిన ఉత్సాహంతో ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలు చేసి యూత్ కు దగ్గర అయ్యే ఆస్కారం ఉంది..






RRR Telugu Movie Review Rating

పాపం.. విమానంలో ప్రయాణం.. గాల్లోనే ప్రాణం పోయింది?

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>