Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyar6fd6da49-3f88-4f1a-8788-e1a26caf17db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyar6fd6da49-3f88-4f1a-8788-e1a26caf17db-415x250-IndiaHerald.jpgమార్చ్ 31వ తేదీ నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసిన నేపథ్యంలో ఇక ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా ప్రతి జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి అన్ని జట్ల ఫ్రాంచైజీలు. ఇలాంటి సమయంలో ఇక కొన్ని జట్లకు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతూ ఉండడం కారణంగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి Ayyar{#}Cricket;BCCI;News;Shreyas Iyer;March;Indianఐపీఎల్ : KKR ను ఆగం చేసిన శ్రేయస్ అయ్యర్?ఐపీఎల్ : KKR ను ఆగం చేసిన శ్రేయస్ అయ్యర్?Ayyar{#}Cricket;BCCI;News;Shreyas Iyer;March;IndianTue, 14 Mar 2023 08:05:00 GMTమార్చ్ 31వ తేదీ నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసిన నేపథ్యంలో ఇక ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా ప్రతి జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి అన్ని జట్ల ఫ్రాంచైజీలు. ఇలాంటి సమయంలో ఇక కొన్ని జట్లకు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతూ ఉండడం కారణంగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే మరో రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు ఈసారి ఎంతో పటిష్టంగా ఉంది అనుకున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా జట్టుకు కెప్టెన్ గా చేసిన ఆటగాడే ఇక ఇప్పుడు సిరీస్ మొత్తం దూరం కాబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. టెస్టుల్లో భారత ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేయడానికి కూడా రాలేదు. ఈ క్రమంలోనే వైద్య చికిత్స కోసం అతని ఆసుపత్రికి తరలించినట్లు బీసీసీఐ తెలిపింది.


 అయితే గాయం కారణంగా ఆసుపత్రి పాలు అయిన అయ్యర్ మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కి కూడా దూరం కాబోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపు మూడు నెలల పాటు శ్రేయస్ అయ్యర్ క్రికెట్ కి దూరం కాబోతున్నాడట.  బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్ కు ఇక శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు భావించారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇక మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో కేకేఆర్ కు భారీ షాక్ తగులుతుంది. ఎందుకంటే అతన్ని 12.25 కోట్లకు దక్కించుకుంది. సారథిగా కూడా నియమించింది కోల్కతా జట్టు.



RRR Telugu Movie Review Rating

నాని "దసరా" మూవీలో ఆ మూడు అంశాలు హైలెట్..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>