Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman3801fcfe-e7e5-40ae-af6b-bf31091d8c91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman3801fcfe-e7e5-40ae-af6b-bf31091d8c91-415x250-IndiaHerald.jpgసాధారణంగానే సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు ఒక్కసారిగా దూసుకు వచ్చి మీద పడినంత పని చేస్తూ ఉంటారు. తమ అభిమాన నటినటులతో ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరట పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి ఇక సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేయడం చేస్తూ ఉంటారు. అందుకనే ఎంతో మంది స్టార్లు ఇక బాడీ గార్డ్ లను మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ఇలాంటిSalman{#}Aamir Khan;Akshay Kumar;Bodyguard;Salman Khan;Heroine;ravi anchor;bollywood;Tollywood;Hero;Cinemaకంపెనీ సీఈఓ కంటే.. ఈ స్టార్స్ బాడీగార్డ్స్ శాలరీనే ఎక్కువట?కంపెనీ సీఈఓ కంటే.. ఈ స్టార్స్ బాడీగార్డ్స్ శాలరీనే ఎక్కువట?Salman{#}Aamir Khan;Akshay Kumar;Bodyguard;Salman Khan;Heroine;ravi anchor;bollywood;Tollywood;Hero;CinemaMon, 13 Mar 2023 13:15:00 GMTసాధారణంగానే సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు ఒక్కసారిగా దూసుకు వచ్చి మీద పడినంత పని చేస్తూ ఉంటారు. తమ అభిమాన నటినటులతో ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరట పడుతూ ఉంటారు.


 ఇలాంటి సమయంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి ఇక  సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేయడం చేస్తూ ఉంటారు. అందుకనే ఎంతో మంది స్టార్లు ఇక బాడీ గార్డ్ లను  మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ఇలాంటిది కనిపించదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇలా బాడీ గార్డ్ లను మైంటైన్ చేసే హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక వారి జీతాలు ఏకంగా ఒక కంపెనీ సీఈవో కంటే ఎక్కువే అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఆ వివరాలు చూసుకుంటే..


 బాడీగార్డ్ కి అందరికంటే ఎక్కువ వేతనం చెల్లిస్తున్న వారిలో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు అని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుఖాన్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే తనకు రక్షణగా రవి సింగ్ అనే బాడీ గార్డ్ ను నియమించుకున్నాడు షారుక్. ఈయన శాలరీ విషయానికొస్తే సంవత్సరానికి దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ సైతం గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి బాడీగార్డ్ గా పెట్టుకున్నాడు. అతనికి సంవత్సరానికి రెండు కోట్ల వరకు సాలరీ ఉంటుందట.


 ఇక బాలీవుడ్లో ఉన్న ముగ్గురు ఖాన్ లలో ఒకడిగా కొనసాగుతున్న అమీర్ ఖాన్.. యువరాజ్ గార్పడే అనే వ్యక్తిని బాడీగార్డ్ గా పెట్టుకున్నాడు. ఇక  అమీర్ ఖాన్ బాడీ గార్డ్ ఒకటి నుంచి 2.5 కోట్ల వరకు కూడా సంపాదిస్తూ ఉంటాడట. అయితే యువరాజ్ గార్పడే బాడీ బిల్డర్ కూడా కావడం గమనార్హం. ఇక అక్షయ్ కుమార్ శ్రేయసే తేలే అనే బాడీగార్డ్ ను పెట్టుకున్నాడు.  అతనికి ఒకటి నుంచి రెండు కోట్ల వరకు శాలరీ ఇస్తాడట. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సైతం జలాల్ అనే బాడీగార్డ్ ను పెట్టుకుంది. అతనికి 90 లక్షల నుంచి 1.5  కోట్ల వరకు శాలరీ ఇస్తుంది అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న బాలయ్య విషెస్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>