Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attackf9bd9db1-940e-475c-995d-c4ee356c1293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attackf9bd9db1-940e-475c-995d-c4ee356c1293-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ లేకుండా పోయింది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని విధంగా విచక్షణ కోల్పోతున్నాడు మనిషి. మనీ అనే మాయలో పడిపోయి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నాడు అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ఏకంగా సొంతింటికే కన్నం వేసి భారీగా డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇలా ఇప్పటివరకు చెడు వ్యసనాలకు అలవాటు పడిన పిల్లలు తల్లిదండ్రుల వద్ద డబ్బుAttack{#}Scotland;Arrest;Katthi;Kanna Lakshminarayana;Father;policeకొడుకు మెడపై కత్తి పెట్టి.. డబ్బులు డిమాండ్ చేసిన తండ్రి.. చివరికి?కొడుకు మెడపై కత్తి పెట్టి.. డబ్బులు డిమాండ్ చేసిన తండ్రి.. చివరికి?Attack{#}Scotland;Arrest;Katthi;Kanna Lakshminarayana;Father;policeMon, 13 Mar 2023 08:45:00 GMTఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ లేకుండా పోయింది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని విధంగా విచక్షణ కోల్పోతున్నాడు మనిషి. మనీ అనే మాయలో పడిపోయి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నాడు అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ఏకంగా సొంతింటికే కన్నం వేసి భారీగా డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇలా ఇప్పటివరకు చెడు వ్యసనాలకు అలవాటు పడిన పిల్లలు తల్లిదండ్రుల వద్ద డబ్బులు దోచుకున్న ఘటనలు వెలుగు చూసాయ్.


 కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పాలి.  ఏకంగా కన్నా కొడుకు దగ్గరే దోపిడీ చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన స్కాట్లాండ్ వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. గాజ్కోలో ఉండే 17 ఏళ్ల యువకుడు ఇటీవల ఏటీఎం వద్దకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకున్నాడు. అయితే అంతలోనే అక్కడికి ముసుగు ధరించి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఇక యువకుడిని వెనుక నుంచి అదిమి పెట్టి మెడపై కత్తి పెట్టాడు. అంతేకాదు ఇక ఏటీఎం నుంచి తీసుకున్న నగదు ఇవ్వాలి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.  కానీ ఆ 17 ఏళ్ల బాలుడు మాత్రం ఇలా తన దగ్గర నుంచి డబ్బులు దోచుకోవాలని ప్రయత్నిస్తుంది తన తండ్రి అన్న విషయాన్ని గొంతు విని గుర్తుపట్టాడు.



 నిజంగానే నాపై ఇలా దాడి చేస్తున్నారా నేను ఎవరో గుర్తుపట్టారా అంటూ ప్రశ్నించాడు. నేను అవేమీ పట్టించుకోను అంటూ నిందితుడు కోపంతో ఊగిపోయాడు. ఇక ఆ తర్వాత ఎంతో చాకచక్యంగా వెనక్కి తిరిగిన యువకుడు తండ్రి ముసుగును లాగేసాడు. ఇక తనకు కత్తి పెట్టి డబ్బులు డిమాండ్ చేసింది ఎవరో కాదు తన కన్న తండ్రి అన్న విషయంపై ముసుగు తీసేసాక పూర్తి క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ఇక తాను కత్తి పెట్టింది సొంత కొడుకుకే అన్న విషయం తెలిసి సదరు తండ్రి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిస్సహాయ  స్థితిలో ఇలాంటి పనిచేయాల్సి వచ్చిందని చెబుతూ క్షమించమని కోరాడు. అయితే అక్కడ నుంచి పారిపోయిన యువకుడు జరిగిన విషయాని కుటుంబ సభ్యులకు పోలీసులకు చెప్పడంతో ఇక అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.



RRR Telugu Movie Review Rating

ఇద్దరు అబ్బాయిల మధ్యలో అమ్మాయి.. నడిరోడ్డుపై రొమాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>