PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyanbdf70dd0-4847-4cd3-93b1-dd6313619740-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyanbdf70dd0-4847-4cd3-93b1-dd6313619740-415x250-IndiaHerald.jpgకాపులకు రిజర్వేషన్ కల్పించాలని అడిగినపుడు రిజర్వేషన్ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. చంద్రబాబు లాగ తప్పుడు హామీలను ఇవ్వనని చెప్పారు. జగన్ అప్పుడు చెప్పిందానికి పవన్ ఇపుడు చేస్తున్న ఆరోపణలకు ఎంత తేడా ఉందో తెలిసిపోతోంది. ఇక చంద్రబాబు వెన్నుపోటు విషయానికి వస్తే జనసేనతో మంచిగా ఉంటూనే రాబోయే ఎన్నికల్లో 20 సీట్లకే పరిమితం చేస్తామనే సంకేతాలను టీడీపీ జనాల్లోకి బలంగా పంపుతోందని వాపోయారు. అలాగే వెయ్యికోట్ల ప్యాకేజీ అని కూడా రాయించారని గుర్తుచేశారు. janaasena pawan tdp chandrababau{#}CBN;Jagan;Janasena;Hanu Raghavapudi;District;TDP;Pawan Kalyan;Population;Party;Cinemaఅమరావతి : చంద్రబాబు వెన్నుపోటు అనుభవంలోకి వచ్చిందా ?అమరావతి : చంద్రబాబు వెన్నుపోటు అనుభవంలోకి వచ్చిందా ?janaasena pawan tdp chandrababau{#}CBN;Jagan;Janasena;Hanu Raghavapudi;District;TDP;Pawan Kalyan;Population;Party;CinemaMon, 13 Mar 2023 03:00:00 GMT

ఇంతకాలానికి చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అనుభవంలోకి వచ్చినట్లుంది. పార్టీ ఆఫీసులో కాపు సంక్షేమసేన అధ్యక్షుడు చేగోండి హరిరామజోగయ్యతో పాటు మరికొంతమంది ముఖ్యలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడారు. 80 శాతం ఉన్న బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీలు కేవలం 20 శాతం మాత్రమే జనాభా వున్న అగ్రకులాలను దేహి అని చేయిచాచటం ఏమిటని మండిపడ్డారు.




రాజ్యాధికారాన్ని, పదవులను అర్ధించటం కాదని శాసించేస్ధాయిలో ఉన్నామని సినిమా డైలాగులు చాలానే చెప్పారు. కాపులు రాజ్యాధికారానికి పనికిరారని చెప్పటం తప్పన్నారు. నిజానికి ఈ మాట ఎవరూ అనలేదు. కొన్నింటిని పవనే కల్పించేసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో తూర్పగోదావరి జిల్లా పర్యటనలో జగన్ కాపులు తనకు అవసరం లేదని చెప్పినా కొందరు కాపులు వైసీపీకే మద్దతుగా నిలబడ్డారని పవన్ అన్నారు. జగన్ ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదు.




కాపులకు రిజర్వేషన్ కల్పించాలని అడిగినపుడు రిజర్వేషన్ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. చంద్రబాబు లాగ తప్పుడు హామీలను ఇవ్వనని చెప్పారు. జగన్ అప్పుడు చెప్పిందానికి పవన్ ఇపుడు చేస్తున్న ఆరోపణలకు ఎంత తేడా ఉందో తెలిసిపోతోంది. ఇక చంద్రబాబు వెన్నుపోటు విషయానికి వస్తే జనసేనతో మంచిగా ఉంటూనే రాబోయే ఎన్నికల్లో 20 సీట్లకే పరిమితం చేస్తామనే సంకేతాలను టీడీపీ జనాల్లోకి బలంగా పంపుతోందని వాపోయారు. అలాగే వెయ్యికోట్ల ప్యాకేజీ అని కూడా రాయించారని గుర్తుచేశారు.





పోటీచేసే సీట్ల విషయమై తాను ఇంతవరకు ఎవరితోను మాట్లాడలేదన్నారు. కాపుల ఆత్మగౌరవం తగ్గేట్లుగా తాను ప్రవర్తించేది లేదన్నారు. దీంతోనే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ఏమిటో పవన్ కు బాగా అనుభవంలోకి వచ్చుంటుంది. మొదటినుండి పవన్ విషయంలో టీడీపీ మైండ్ గేమే ఆడుతోంది. ఈ విషయం తెలుసుకోలేకే చంద్రబాబు చెప్పిందానికి పవన్ తలూపుతున్నారు. ఇపుడు జోగయ్య కూడా చంద్రబాబుకు దూరంగా ఉండమనే పవన్ కు సలహా ఇచ్చారు. చంద్రబాబుతో పెట్టుకుంటే పవన్ ఏమైపోతారో బహుశా జోగయ్యకు అర్ధమైపోయుంటుంది. మరి పవన్ కు పూర్తి క్లారిటి ఎప్పుడుస్తుందో ?




RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు వెన్నుపోటు అనుభవంలోకి వచ్చిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>