MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc70e7f9a-5fdf-40a5-9f4b-d9355cedbbd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc70e7f9a-5fdf-40a5-9f4b-d9355cedbbd7-415x250-IndiaHerald.jpgసౌత్ సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ అంటే మొదటి నుంచే ఆడియన్స్ లో మంచి ఇంప్రెషన్ ఉంది. ఇప్పటివరకు కీర్తి సురేష్ నటనకు మాత్రమే స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. అందుకే ఆమెకు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన విషయం తెలిసింది. అలాంటి కీర్తి సురేష్ ఈ మధ్య తన గ్లామర్ డోస్ ని భారీగా పెంచేసింది. దానికి కూడా కారణం లేకపోలేదు. నటనను నమ్ముకుంటే ఈ మధ్య Keerthi Suresh{#}Raccha;Samantha;Audience;News;Mahanati;keerthi suresh;srikanth;Nani;March;Heroine;Mass;Director;India;Cinema'పుష్ప2' లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. సుక్కు స్కెచ్ వేరే లెవెల్..?'పుష్ప2' లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. సుక్కు స్కెచ్ వేరే లెవెల్..?Keerthi Suresh{#}Raccha;Samantha;Audience;News;Mahanati;keerthi suresh;srikanth;Nani;March;Heroine;Mass;Director;India;CinemaMon, 13 Mar 2023 16:00:00 GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ అంటే మొదటి నుంచే ఆడియన్స్ లో మంచి ఇంప్రెషన్ ఉంది. ఇప్పటివరకు కీర్తి సురేష్ నటనకు మాత్రమే స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. అందుకే ఆమెకు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన విషయం తెలిసింది. అలాంటి కీర్తి సురేష్ ఈ మధ్య తన గ్లామర్ డోస్ ని భారీగా పెంచేసింది. దానికి కూడా కారణం లేకపోలేదు. నటనను నమ్ముకుంటే ఈ మధ్య కీర్తి సురేష్ కు అవకాశాలు రావడం లేదు. అందుకే ఆమె ఇప్పుడు గ్లామర్ రోల్స్ కి, ఎక్స్పోజింగ్ కి ఓకే చెప్పింది. 

ఇక సోషల్ మీడియాలో సైతం ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్ తో రచ్చ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఈ క్రమం క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా తన కెరీర్లో మునుపెన్నడు చేయని ఓ పనికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య అగ్ర హీరోయిన్లందరూ ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. తాజా సమాచారం ప్రకారం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెకిస్తున్న 'పుష్ప 2' లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతుందట. అల్లు అర్జున్తో కలిసి మాస్ స్టెప్పులతో పాటు అందాలు ఆరబోయడానికి కీర్తి సురేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ లో సమంత ఏ రేంజ్ లో తన అందాల ఆరబోతతో రెచ్చిపోయిందో..

ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పార్ట్ 2 లో అదే రేంజ్ లో అందాల ఆరబోతను చూపించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇది తెలిసిన ఫ్యాన్స్ మాత్రం కీర్తి సురేష్ ని ఐటమ్ సాంగ్ చేయవద్దని వారిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న నువ్వు ఇలాంటి ఐటెం సాంగ్స్ చేస్తే ఇమేజ్ అంతా డామేజ్ అవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత అవకాశాలు రాక కెరీర్ నాశనం అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఫ్యాన్స్ చెబుతున్నట్టు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ కి నో చెబుతుందా? లేక ఎస్ చెబుతుందా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ నాచురల్ స్టార్ నాని సరసన 'దసరా' అనే సినిమాలో నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో వెండితెరకు డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. మార్చి 30న ఏ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది...!!



RRR Telugu Movie Review Rating

వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>