Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/watchd3fa0906-5a58-475f-8c93-0efd173e78b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/watchd3fa0906-5a58-475f-8c93-0efd173e78b9-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పెరిగిపోయిన టెక్నాలజీ ఇక ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. టెక్నాలజీ అనుగుణంగానే మనిషి జీవన శైలి కూడా రోజుకు మారిపోతుంది. ఇక ఇప్పుడు కేవలం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలను కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. ఏం టెక్నాలజీ ఏమో గురు ఫోన్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది.. ఎక్కడ సైబర్ అటాక్ జరిగి ఖాతా ఖాళి అవుతుందేమో అని Watch{#}Smart phone;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;Eveningస్మార్ట్ వాచ్.. మరో ప్రాణాన్ని కాపాడింది?స్మార్ట్ వాచ్.. మరో ప్రాణాన్ని కాపాడింది?Watch{#}Smart phone;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;EveningSun, 12 Mar 2023 17:00:00 GMTఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పెరిగిపోయిన టెక్నాలజీ ఇక ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. టెక్నాలజీ అనుగుణంగానే   మనిషి జీవన శైలి కూడా రోజుకు మారిపోతుంది. ఇక ఇప్పుడు కేవలం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలను కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. ఏం టెక్నాలజీ ఏమో గురు ఫోన్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది.. ఎక్కడ సైబర్ అటాక్ జరిగి ఖాతా ఖాళి అవుతుందేమో అని భయమేస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది.


 నిజమే టెక్నాలజీ పెరిగిపోవడం కారణంగా కొన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయి. కానీ అంతకు మించిన ప్రయోజనాలను కూడా మనిషి పొందగలుగుతున్నాడు అని చెప్పాడు.  ముఖ్యంగా నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన స్మార్ట్ వాచ్లు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నాయ్ అని చెప్పాలి. ఇక బ్రిటన్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆడమ్ క్రొఫ్ట్ అనే వ్యక్తి స్మార్ట్ వాచ్ కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 36 ఏళ్ల వయసులో ఉన్న ఆయన హృదయ సంబంధిత అస్వస్థతకు గురి అయ్యారు.


 అయితే ఈ విషయం మాత్రం ఆయనకు తెలియలేదు. కానీ ఆయన పెట్టుకున్న ఆపిల్ స్మార్ట్ వాచ్ మాత్రం ఆయనను హెచ్చరిస్తూనే వచ్చింది. చివరికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే అసలు విషయం బయటపడింది. దీంతో ఇక చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తన ఆపిల్ గడియారంలోని ఈ ఫీచర్ ని ఉపయోగించుకుంటానని తను ఎన్నడు అనుకోలేదు. ఓ రోజు సాయంత్రం సోఫా నుంచి లేచాను. అప్పుడు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. కొంచెం మంచి నీళ్లు తాగుదామని వంట గదిలోకి వెళ్తే అప్పుడు ప్రపంచం  తలకిందులు అయినట్లు అనిపించింది. అయితే అంతకుముందు తన గడియారం ప్రతి రెండు గంటలకు ఒకసారి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్తే అట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందని చెప్పి డాక్టర్లు చికిత్స చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.



RRR Telugu Movie Review Rating

హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా సింగర్ శ్రేయా ఘోషల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>