EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kezriwal61a9617c-6b71-482d-9c20-0c256bff1a7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kezriwal61a9617c-6b71-482d-9c20-0c256bff1a7c-415x250-IndiaHerald.jpgపంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ నేతలు ఎన్ని దాడులు, కుట్రలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఢిల్లిలో అధికారంలో ఉన్న ఆప్ అక్కడ తమను అభివృద్ధి చేయనీయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించేది. కానీ పంజాబ్ లో నేరుగా జయకేతనం ఎగురవేశాక పంజాబ్ సీఎంగా ఆప్ అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే పంజాబ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటు వాదులు, డ్రగ్స్ మాఫియా రెండు కీలక అంశాలు. ఈ మధ్య పంజాబ్ లోని ఓ ప్రాంతంలో ఖలిKEZRIWAL{#}Punjab;Police Station;Arvind Kejriwal;Drugs;Delhi;Bharatiya Janata Party;Party;Telangana Chief Ministerపంజాబ్‌.. లిక్కర్‌.. కేజ్రీవాల్‌కు సవాల్‌?పంజాబ్‌.. లిక్కర్‌.. కేజ్రీవాల్‌కు సవాల్‌?KEZRIWAL{#}Punjab;Police Station;Arvind Kejriwal;Drugs;Delhi;Bharatiya Janata Party;Party;Telangana Chief MinisterSat, 11 Mar 2023 13:00:00 GMTపంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ నేతలు ఎన్ని దాడులు, కుట్రలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఢిల్లిలో అధికారంలో ఉన్న ఆప్ అక్కడ తమను అభివృద్ధి చేయనీయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించేది. కానీ పంజాబ్ లో నేరుగా జయకేతనం ఎగురవేశాక పంజాబ్ సీఎంగా ఆప్ అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే పంజాబ్ లో అనేక సమస్యలు ఉన్నాయి.


ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటు వాదులు, డ్రగ్స్ మాఫియా రెండు కీలక అంశాలు. ఈ మధ్య పంజాబ్ లోని ఓ ప్రాంతంలో ఖలిస్తాన్ వేర్పాటు వాదులు నిరసనకు దిగి ఏకంగా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లి పోలీసులనే చితకబాదారు. విధ్వంసం సృష్టించారు. ఇలా పాలనలో చేతకాని తనం వల్ల పంజాబ్ లో మళ్లీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.


గతంలో పూర్తి స్థాయి అధికారం మాకు ఇస్తే తామేంటో చూపిస్తాం అన్న ఆప్ నేత కేజ్రీవాల్ ఈ విషయంలో మాత్రం మిన్నకుండిపోయారు. నిజాయతీ అనే ఒకే ఒక్క మాటతో ఢిల్లీలో రెండు సార్లు అధికార పీఠం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం లిక్కర్ స్కాం లో ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే దాకా చేరుకున్నారంటే ఎంతటి అవినీతి జరుగుతుందో తెలుసుకోవచ్చు.


ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ నుంచి పంజాబ్, గుజరాత్, లాంటి రాష్ట్రాల్లో బాగానే విస్తరింపజేశారు. ఢిల్లీ, పంజాబ్ లలో అధికార పార్టీగా పాలన సాగిస్తున్నారు. అలాంటి కేజ్రీవాల్ ప్రస్తుతం కర్ణాటక ప్రజలను కలిసేందుకు బెంగళూరుకు వస్తున్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో పోటీ చేయనుంది. ఢిల్లీ, పంజాబ్ లలో సాధించిన విజయాన్ని కర్ణాటకలో సాధించాలంటే కేజ్రీవాల్ కు అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో మచ్చ లేని నాయకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఆప్ నేతలు ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.



RRR Telugu Movie Review Rating

పవన్ అభిమానులకు శుభవార్త తెలిపిన ఉస్తాద్ టీమ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>