MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/80-crores-isuee-around-natu-natu-song423c4d6a-6c61-4a6e-ba3b-0d172023e5ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/80-crores-isuee-around-natu-natu-song423c4d6a-6c61-4a6e-ba3b-0d172023e5ce-415x250-IndiaHerald.jpgభారతీయ కాలమాన ప్రకారం రాబోతున్న సోమవారం ఉదయం 5.30 నిముషాలు ఎప్పుడు వస్తుందా అంటూ చరణ్ జూనియర్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఆసమయం నుండి అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వస్తుందని తెలుగువారు అంతా భావిస్తున్నారు. సహస్రావధాని గరికపాటి లాంటి మహోన్నత వ్యక్తి కూడ అచ్చు తెలుగు పదాలతో కూడిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని సరస్వతీ దేవిని ప్రార్థిస్తాం అJUNIOR NTR{#}achu;tammareddy bharadwaja;monday;Nagababu;James Cameron;Darsakudu;Rajamouli;Oscar;Jr NTR;Industry;producer;Producer;Director;Telugu;Cinemaనాటు నాటు చుట్టూ తిరుగుతున్న 80 కోట్ల రగడ !నాటు నాటు చుట్టూ తిరుగుతున్న 80 కోట్ల రగడ !JUNIOR NTR{#}achu;tammareddy bharadwaja;monday;Nagababu;James Cameron;Darsakudu;Rajamouli;Oscar;Jr NTR;Industry;producer;Producer;Director;Telugu;CinemaSat, 11 Mar 2023 08:00:00 GMTభారతీయ కాలమాన ప్రకారం రాబోతున్న సోమవారం ఉదయం 5.30 నిముషాలు ఎప్పుడు వస్తుందా అంటూ చరణ్ జూనియర్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఆసమయం నుండి అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వస్తుందని తెలుగువారు అంతా భావిస్తున్నారు.


సహస్రావధాని గరికపాటి లాంటి మహోన్నత వ్యక్తి కూడ అచ్చు తెలుగు పదాలతో కూడిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని సరస్వతీ దేవిని ప్రార్థిస్తాం అంటూ చెప్పారు అంటే ఆపాట మ్యానియా ఏరేంజ్ లో ఉందో ఎవరికైనా అర్థం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రముఖ నిర్మాత దర్శకుడు కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ ఈపాటకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు వెనుక జరిగిన వ్యూహాల పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ ప్రముఖులకు అసహనాన్ని కలిగించింది.


హాలీవుడ్ మీడియాలో ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ అవార్డుల రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి టీమ్ 80 కోట్లవరకు ఖర్చుపెట్టిందని ఆడబ్బుతో 8 మంచి సినిమాలు తీయవచ్చు అంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 'మిత్రుడు భరద్వాజ్ కి తెలుగు సినిమాకు తెలుగు సాహిత్యానికి తెలుగు దర్శకుడికి తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతేకానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీదగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?' అంటూ కొంచం ఘాటుగానే చురకలు వేసారు.


ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత ఘాటుగా తమ్మారెడ్డిని టార్గెట్ చేసాడు. ఏది ఎలా ఉన్నా ‘నాటు నాటు’ పాట చుట్టూ 80 కోట్ల రగడ అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది..






RRR Telugu Movie Review Rating

గొప్ప మనసు చాటుకున్న నమ్రత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>