Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-01bcea03-fa06-493d-9c57-d442fdfbddc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-01bcea03-fa06-493d-9c57-d442fdfbddc5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కృతిశెట్టి, శ్రీలీల దాదాపుగా ఒకే టైం లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కృతిశెట్టి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ కాగా ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు. అయితే శ్రీలీల కెరీర్ మాత్రం మరో దారిలో నడిచింది. తొలి సినిమా పెళ్లి సందడి, రెండో సినిమా ధమాకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వరుసగా రెండు సక్సెస్ లతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగింది. శ్రీలీల చేతిలో ప్రస్తుతం అటూఇటుగా పది సినిమాలు ఇస్తున్నాయి. ఆమSocialstars lifestyle {#}Blockbuster hit;Success;Heroine;Cinema;gold;mediaశ్రీలీల మరియు కృతిశెట్టి కి మధ్య డిఫరెన్స్ అదేనా.....!!శ్రీలీల మరియు కృతిశెట్టి కి మధ్య డిఫరెన్స్ అదేనా.....!!Socialstars lifestyle {#}Blockbuster hit;Success;Heroine;Cinema;gold;mediaSat, 11 Mar 2023 22:10:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కృతిశెట్టి, శ్రీలీల దాదాపుగా ఒకే టైం లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కృతిశెట్టి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ కాగా ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.

అయితే శ్రీలీల కెరీర్ మాత్రం మరో దారిలో నడిచింది. తొలి సినిమా పెళ్లి సందడి, రెండో సినిమా ధమాకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వరుసగా రెండు సక్సెస్ లతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగింది.

శ్రీలీల చేతిలో ప్రస్తుతం అటూఇటుగా పది సినిమాలు ఇస్తున్నాయి. ఆమె చేతిలో ఉన్న సినిమాల సంఖ్య విని షాకవ్వడం ఇతర దర్శకనిర్మాతల వంతమవుతోంది. అయితే శ్రీలీల స్టార్ హీరోయిన్ అవ్వడానికి కృతి ఫ్లాప్ హీరోయిన్ అవ్వడానికి రీజన్ ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. కృతిశెట్టి వరుస సినిమాలపై దృష్టి పెడితే శ్రీలీల మాత్రం కథ, పాత్రలపై దృష్టి పెట్టింది.

ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లను అందుకునే దిశగా శ్రీలీల అడుగులు వేస్తోంది. కృతిశెట్టి ఇకనైనా కథలపై దృష్టి పెడితే ఆమె కూడా మరో రేంజ్ కు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యునరేషన్ 60 లక్షల రూపాయలు కాగా శ్రీలీల పారితోషికం మూడు రెట్లు ఎక్కువగా ఉంది.

శ్రీలీల దెబ్బకు ఇతర హీరోయిన్లకు సైతం అవకాశాలు తగ్గాయి. శ్రీలీల అందం, అభినయంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో శ్రీలీల మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య, మహేష్, పవన్ సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రీలీలకు కెరీర్ పరంగా తిరుగులేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కస్టడీ మూవీ రిజల్ట్ పై కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

ఏదైతేనేం శ్రీలీల పట్టిందల్లా బంగారం లాగా ఉంటే కృతిశెట్టి మాత్రం పట్టుకుంటే బొగ్గు లాగా మారిపోతుందని సోషల్ మీడియా ద్వారా నేటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మంచి రోల్స్ ఉన్నా క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రాజమౌళి తదుపరి చిత్రాలు ఆడకపోతే దానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>