EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan42ad71a8-e520-4200-883f-ceaa0ee33bba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan42ad71a8-e520-4200-883f-ceaa0ee33bba-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జిల్లాలను విభజించి వాటికి పేర్లు పెట్టాడు. 2014 తర్వాత చంద్రబాబు ఆ పని చేస్తానంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు. రోశయ్య అయితే గతంలో ఆల్రెడీ ఉన్న జిల్లాలకు కొత్తగా పేర్లు పెట్టాడు. కడప జిల్లాకి వైయస్సార్ కడప జిల్లా అని, నెల్లూరు జిల్లా కి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేర్లు పెట్టారు. అయితే కోనసీమకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెడదామనుకొని, అక్కడ ఉన్న కాపుల ఓట్లు కోల్పోకూడదని ఆ విషయం అక్కడితో ఆపేశారు. అయితే ఆ తర్వాత చంద్రబJAGAN{#}CBN;kalyan;sathish;Godavari River;Krishna River;Jagan;MP;kadapa;Scheduled caste;Nellore;CM;MLA;Minister;Potti Sreeramulu;Reddy;District;NTRజగన్‌ వేసిన ఈ ఎత్తుతో ఆ కులస్తులు ఫ్లాట్ అవుతారా?జగన్‌ వేసిన ఈ ఎత్తుతో ఆ కులస్తులు ఫ్లాట్ అవుతారా?JAGAN{#}CBN;kalyan;sathish;Godavari River;Krishna River;Jagan;MP;kadapa;Scheduled caste;Nellore;CM;MLA;Minister;Potti Sreeramulu;Reddy;District;NTRFri, 10 Mar 2023 10:00:00 GMTజగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జిల్లాలను విభజించి వాటికి పేర్లు పెట్టాడు. 2014 తర్వాత చంద్రబాబు ఆ పని చేస్తానంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు. రోశయ్య అయితే గతంలో ఆల్రెడీ ఉన్న జిల్లాలకు కొత్తగా పేర్లు పెట్టాడు. కడప జిల్లాకి వైయస్సార్ కడప జిల్లా అని, నెల్లూరు జిల్లా కి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేర్లు పెట్టారు.


అయితే కోనసీమకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెడదామనుకొని, అక్కడ ఉన్న కాపుల ఓట్లు కోల్పోకూడదని ఆ విషయం అక్కడితో ఆపేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు, అంబేద్కర్ పేరు కోనసీమకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం మొదలుపెట్టారు. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అదే స్వరాన్ని అందుకున్నాడు.
 

ఎస్సీ ఓట్లు ఇంకా మైనార్టీ ఓట్లు వైఎస్ఆర్సిపి కి సొంత ఓటు బ్యాంకు లాంటివి. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారని అనుకున్న జగన్మోహన్ రెడ్డి అర్జెంట్ గా ఒక కమిటీ వేసి మళ్లీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెడుతున్నామని ప్రకటించేశారు. దాంతో అక్కడున్న కాపులు జగన్ కి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. దీంతో ప్రారంభమైన గొడవలు కొట్టుకోవడం నుంచి తాజాగా  కేసుల వరకూ వెళ్ళిపోయాయి.


అయితే తాజాగా త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఎంపీ మిధున రెడ్డి ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సీఎం జగన్ ని కలిసి  కొందరు అమాయకులైన యువత భవిష్యత్తు దీనివల్ల నాశనం అవుతుందని, వాళ్లపైన నమోదైన కేసులను  ఉపసంహరించుకోవాలని సీఎం ను కోరారు. కాబట్టి ఎత్తేస్తామన్నారు. అమాయకులపై కేసులు ఎత్తేయొచ్చు గాని అసలు చేసిన వారిని వదిలేయకూడదు కదా! కానీ ఇప్పుడు ఇలా రెండు వర్గాల మీద కేసులు ఎత్తేస్తే రెండు వర్గాల వారి ఓట్లు గెలుచుకోవచ్చనే ఎత్తుగడ ఇది.



RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరపిస్తున్న కేతిక శర్మ..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>