Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5a8b9375-a5df-4a26-b6d8-4aa1a3c2d164-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5a8b9375-a5df-4a26-b6d8-4aa1a3c2d164-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్లు ఇక వికెట్ పడగొట్టడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఇక అప్పటికే భారీ స్కోరు చేయడం గమనార్హం. అయితే సాధారణంగCricket {#}Anandam;Varsham;Rohit Sharma;Australia;Narendra Modi;Ahmedabad;Indiaఇన్నాళ్ళ కెరియర్లో.. ఈ సెంచరీ వెరీ స్పెషల్ : ఖవాజాఇన్నాళ్ళ కెరియర్లో.. ఈ సెంచరీ వెరీ స్పెషల్ : ఖవాజాCricket {#}Anandam;Varsham;Rohit Sharma;Australia;Narendra Modi;Ahmedabad;IndiaFri, 10 Mar 2023 12:30:00 GMTప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్లు ఇక వికెట్ పడగొట్టడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఇక అప్పటికే భారీ స్కోరు చేయడం గమనార్హం.


 అయితే సాధారణంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ జరిగింది అంటే చాలు ఇరుజట్ల ఆటగాళ్లు కూడా సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి ఎప్పుడు తమ ప్రదర్శనతో వార్తల్లో నిలవడం చూస్తూ ఉంటాం.  కానీ ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఒక్క రోహిత్ శర్మ మినహా ఇప్పటివరకు ఇరు జట్ల నుంచి ఏ ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయలేదు. కానీ ఇటీవల నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ తో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.


 కాగా తన సెంచరీ గురించి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. చివరి టెస్ట్ మ్యాచ్ లో సాధించిన సెంచరీ తన కెరియర్ లో ఎంతో అద్భుతమైనది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సెంచరీలో చాలా ఎమోషన్ కూడా ఉంది అంటూ తెలిపాడు. ఇంతకుముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. కానీ జట్టులో ఆడే అవకాశం రాలేదు. 8 టెస్ట్ మ్యాచ్ లలో కూడా డ్రింక్స్ బాయ్ గానే ఉన్నాను. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోలేదు. వికెట్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే అనుకున్నాను. అందుకే ఈ సెంచరీ వెరీ స్పెషల్. ఇది మానసికయుద్ధం.. ఇక్కడ ఆటే ప్రధానం అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>