Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-video-mida-press-meet-petti-vivarana-istananna-naresh755df3c0-95a7-4078-941a-cb53a9417e78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-video-mida-press-meet-petti-vivarana-istananna-naresh755df3c0-95a7-4078-941a-cb53a9417e78-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క వీడియోతో టాలీవుడ్ ని షేక్ చేశాడు నటుడు నరేష్. ఆయన తనకు పెళ్ళైనట్లు ఒక వీడియో షేర్ చేశారు. మార్చి పదవ తేదీ ఉదయం నరేష్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆయన నటి పవిత్ర లోకేష్ మెడలో తాళి కట్టాడు. కొందరు బంధువుల మధ్య ఈ పెళ్లి తంతు ముగిసినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇదిలా ఉంటే నరేష్, పవిత్ర రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారని, ఇద్దరూ హనీమూన్ కి కూడా వెళ్లారంటున్నారు. ఈ క్రమంలో దుబాయిలో చక్కర్లు కొట్టిన వారి వీడియోలు, ఫోటోలు బయటకు తీస్తున్నారు. ఇప్పుడSocialstars lifestyle {#}ramya;ramya krishnan;Press;Naresh;allari naresh;Event;Wife;Lokesh;Lokesh Kanagaraj;marriage;Tollywood;Cinema;March;News;mediaఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తానన్న 'నరేష్ '.....!!ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తానన్న 'నరేష్ '.....!!Socialstars lifestyle {#}ramya;ramya krishnan;Press;Naresh;allari naresh;Event;Wife;Lokesh;Lokesh Kanagaraj;marriage;Tollywood;Cinema;March;News;mediaFri, 10 Mar 2023 21:19:36 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క వీడియోతో టాలీవుడ్ ని షేక్ చేశాడు నటుడు నరేష్. ఆయన తనకు పెళ్ళైనట్లు ఒక వీడియో షేర్ చేశారు. మార్చి పదవ తేదీ ఉదయం నరేష్ చేసిన వ్యాఖ్యనం ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

ఆయన నటి పవిత్ర లోకేష్ మెడలో తాళి కట్టాడు. కొందరు బంధువుల మధ్య ఈ పెళ్లి తంతు ముగిసినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇదిలా ఉంటే నరేష్, పవిత్ర రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారని, ఇద్దరూ హనీమూన్ కి కూడా వెళ్లారంటున్నారు. ఈ క్రమంలో దుబాయిలో చక్కర్లు కొట్టిన వారి వీడియోలు, ఫోటోలు బయటకు తీస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పాతది అంటున్నారు.

దుబాయ్ లో జంటగా విహరిస్తున్న నరేష్-పవిత్రల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉదయం పెళ్లి వీడియో పోస్ట్ చేసిన నరేష్ మధ్యాహ్నం ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇంటింటి రామాయణం అనే మూవీలో నరేష్ కీలక రోల్ చేశారు. మూవీ విడుదల నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నరేష్ ని వివరణ అడిగారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్నారా? ఆ వీడియో అర్థం ఏమిటని కూపీ లాగే ప్రయత్నం చేశారు.

అయితే నరేష్ స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా సస్పెన్సులో పెట్టారు. ఇప్పుడు మా సినిమా గురించే మాట్లాడతాను. దాని గురించే అడగండి. వ్యక్తిగత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తాను… అన్నారు. దీంతో నరేష్ నిజంగా నాలుగో వివాహం చేసుకున్నారా? లేక ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగమా అనే సందేహాలు కొనసాగుతున్నాయి. మీడియాకు స్పష్టమైన సమాచారం అందడం లేదు.

మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ కి విడాకులు ఇవ్వలేదు. రమ్య విడాకులకు ఒప్పుకోవడం లేదు. భార్య ఉండగా వివాహం చేసుకోవడం నేరం అవుతుంది. అయితే నరేష్-రమ్య విడిపోయి ఏడేళ్లు అవుతుందట. చట్టపరంగా నరేష్ కి సానుకూల అంశాలు ఉన్న తరుణంలో పవిత్రను వివాహం చేసుకున్నారని అంటున్నారు. ఆ పెళ్లి వీడియో ఆంతర్యం ఏమిటో తెలియాలంటే నరేష్ మీడియా ముందుకు రావాల్సిందే. వివరణ ఇవ్వాల్సిందే. అప్పటి వరకు ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్నాళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన పవిత్రను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారకం గా అనౌన్స్మెంట్ కూడా చేసారు.

ఐతే ఆయన అప్పట్లో అన్నట్టుగానే చేసారు అని సోషల్ మీడియా వేదికగా  నేటిజన్లు అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

చీరలో కట్టిపడేస్తున్న ఫరియా అబ్దుల్లా..!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>