MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-nani6bdcb92d-7743-4ded-9e8d-0666569e8fee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actor-nani6bdcb92d-7743-4ded-9e8d-0666569e8fee-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దసరా'. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రాగా.. మార్చి 30న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలో విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉంది. ఈ సినిమాను తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామం నేపథ్యంలో చిత్రీకరించారు. అయితే తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో నానిActor Nani{#}vennela;Suresh;village;Dussehra;Vijayadashami;Telangana;Nani;srikanth;Heroine;India;Father;keerthi suresh;March;Hero;Director;Cinema;Interview;Manamదసరా కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది: నానిదసరా కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది: నానిActor Nani{#}vennela;Suresh;village;Dussehra;Vijayadashami;Telangana;Nani;srikanth;Heroine;India;Father;keerthi suresh;March;Hero;Director;Cinema;Interview;ManamFri, 10 Mar 2023 16:25:00 GMTనాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దసరా'. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రాగా.. మార్చి 30న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలో విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉంది. ఈ సినిమాను తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామం నేపథ్యంలో చిత్రీకరించారు. అయితే తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' నేను ఈ కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి.

అందుకే నేను ఈ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. మా డైరెక్టర్ శ్రీకాంత్ ది కూడా గోదావరిఖని ప్రాంతమే. వాళ్ళ నాన్న కూడా సుమారు 40 ఏళ్ల పాటు బొగ్గు గనుల్లో డంపర్ గా పనిచేశాడు. ఇక ఈ కథ వినడానికి శ్రీకాంత్ను నేను కలిసినప్పుడు,అతను ఒక హీరోని మెప్పించే విధంగా కథ చెప్పాడు. కథకు సంబంధించి అతని విజువల్ సెన్స్ ఎలా ఉందో చూడ్డానికి నేను కొన్ని సీన్లు చేయమని చెప్పాను. ఆ సీన్లను శ్రీకాంత్ ఎంతో చక్కగా తీశాడు. దీంతో అతను కథను బాగా హ్యాండిల్ చేయగలరని అర్థమైంది' అని నాని తెలిపాడు. ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేయాలి అని ఆలోచించినప్పుడు కీర్తి సురేష్ అయితే ఈ స్టోరీకి బాగా సెట్ అవుతుందని అనిపించింది.

ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే పాత్రలో ఎంతో చక్కగా నటించింది. ఎందుకంటే ఈ సినిమా కథ మొత్తం వెన్నెల పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వాస్తవానికి ఈ కథను ముందు శ్రీకాంత్ కీర్తి సురేష్ కి చెప్పినప్పుడు ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తర్వాత సందర్భంలో తాను ఎందుకు దసరా మూవీలోకి రాలేదని ఆమెను అడిగితే తను ఏ స్క్రిప్టు వినలేదని చెప్పింది. దీంతో ఆ తర్వాత శ్రీకాంత్ ఫోన్ చేసి అడిగితే తాను మూడు గంటల పాటు కథ చెప్పానని చెప్పాడు. అయితే శ్రీకాంత్ పక్కా తెలంగాణ భాషలో కథ చెప్పడం వల్ల కీర్తి సురేష్ అంతగా అర్థం చేసుకోలేకపోయింది. దీతో తర్వాత మరోసారి కథను వినిపిస్తే కథ విన్న తర్వాత ఆమె ఎంతో బాగా ఇంప్రెస్ అయ్యి.. మళ్లీ మనం మాట్లాడకపోయుంటే మంచి కథను మిస్ అయ్యానని చెప్పింది' అంటూ నాని తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించారు...!!



RRR Telugu Movie Review Rating

రాకింగ్ రాకేష్, సుజాత లకు మల్లెమాల ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>