MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/mahilalu-sceams4043b34b-ad87-4e2b-87de-c2563ba50f05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/mahilalu-sceams4043b34b-ad87-4e2b-87de-c2563ba50f05-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని అవకాశాలను అందుకుంటూ వారితో దీటుగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు అండగా నిలవడానికి పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ.. ఆ పథకాల ద్వారా అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మొదలుకొని వివిధ ప్రైవేటు సంస్థలు కూడా వారి కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలలో ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రత్యేకించి మహిళల కోసం ఎక్కువ వడ్డీ లభించే పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. MAHILALU; SCEAMS{#}central governmentమనీ: మహిళలకు అత్యధిక వడ్డీ ఇచ్చే పథకాలు ఇవే..!మనీ: మహిళలకు అత్యధిక వడ్డీ ఇచ్చే పథకాలు ఇవే..!MAHILALU; SCEAMS{#}central governmentThu, 09 Mar 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని అవకాశాలను అందుకుంటూ వారితో దీటుగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు అండగా నిలవడానికి పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ.. ఆ పథకాల ద్వారా అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మొదలుకొని వివిధ ప్రైవేటు సంస్థలు కూడా వారి కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలలో ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రత్యేకించి మహిళల కోసం ఎక్కువ వడ్డీ లభించే పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పంజాబ్ అండ్ సింధు బ్యాంక్..
ఈ బ్యాంకు మీకు గృహలక్ష్మి ఫిక్స్ డిపాజిట్ స్కీమ్ ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని మెచ్యూరిటీ వ్యవధి 551 రోజులు మాత్రమే. ఇందులో మీరు రెండు రకాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు . ఆఫ్లైన్ లేదా ఆన్లైన్.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలకు ఆఫ్లైన్ పెట్టుబడికి 6.65% వడ్డీ రేటు.. అదే ఆన్లైన్ పెట్టుబడికి 6.9% వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్ మహిళలకు అయితే ఆఫ్ లైన్ పెట్టుబడికి 7.15% ఆన్లైన్ పెట్టుబడికి 7.4% వడ్డీ లభిస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్..
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకమే ఇది. ఇందులో ₹2లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు కూడా 7.50% లభిస్తుంది. వయసుతో సంబంధం లేదు కాబట్టి ఇందులో చేరవచ్చు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం గురించి పూర్తి వివరాలు లభిస్తాయి.

ఇండియన్ బ్యాంక్:
400 రోజులపాటు చేసే ఫిక్స్ డిపాజిట్ లపై 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు 7.15% వడ్డీ లభించక సీనియర్ సిటిజెన్లకు 7.60% సూపర్ సిటిజెన్లకు 7.9% వడ్డీ రేటు లభిస్తోంది. వీటితోపాటు మరెన్నో ఫిక్స్ డిపాజిట్ లపై అధిక వడ్డీ రేటు ఆఫర్ చేసే బ్యాంకులు కూడా అందుబాటులో ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>