PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibans-afghanisthan-d197ec07-8ecf-499c-8572-9745fd444988-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibans-afghanisthan-d197ec07-8ecf-499c-8572-9745fd444988-415x250-IndiaHerald.jpgభర్తల చేతిలో వేధింపులకు గురవుతున్న భార్యలు చట్టప్రకారం విడాకులు తీసుకుని విడిగా వాళ్ళ బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు. అలాంటిది గతంలో తీసుకున్న విడాకులు చెల్లవని, వాటిని తాము రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. విడాకులు తీసుకున్న భార్యలంతా తమ మాజీ భర్తల దగ్గరకు వెళ్ళి కాపురాలు చేసుకోవాలని ఆదేశాలు జారిచేసింది. దీంతో మహిళలకు షాక్ కొట్టినట్లయ్యింది. భర్తల వేధింపులను భరించలేకే షరియా చట్టప్రకారమో లేకపోతే న్యాయస్ధానాల ద్వారానో విడాకులు తీసుకున్నారు. Talibans Afghanisthan {#}war;Government;American Samoaకాబూల్ మహిళలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారా ?కాబూల్ మహిళలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారా ?Talibans Afghanisthan {#}war;Government;American SamoaThu, 09 Mar 2023 05:00:00 GMT

ఏ ముహూర్తాన ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అదికారం అందుకున్నారో కానీ అప్పటినుండి జనాలకు ముఖ్యంగా మహిళలకు చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యోగాలకు వెళ్ళేందుకు లేదన్నారు. విద్యాసంస్ధలకు వెళుతున్న అమ్మాయిలను బయట తిరగనీయకుండా అడ్డుకున్నారు. ఆడవాళ్ళు ఇంటినుండి బయటకు రానీయకుండా అనేక ఆంక్షలు విధించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు తాజాగా మరో విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. అదేమిటంటే గతంలో తీసుకున్న విడాకులను రద్దు చేస్తున్నారట.





భర్తల చేతిలో వేధింపులకు గురవుతున్న భార్యలు చట్టప్రకారం విడాకులు తీసుకుని విడిగా వాళ్ళ బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు.  అలాంటిది గతంలో తీసుకున్న విడాకులు చెల్లవని, వాటిని తాము రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. విడాకులు తీసుకున్న భార్యలంతా తమ మాజీ భర్తల దగ్గరకు వెళ్ళి కాపురాలు చేసుకోవాలని ఆదేశాలు జారిచేసింది. దీంతో మహిళలకు షాక్ కొట్టినట్లయ్యింది. భర్తల వేధింపులను భరించలేకే షరియా చట్టప్రకారమో లేకపోతే న్యాయస్ధానాల ద్వారానో విడాకులు తీసుకున్నారు.





ఎప్పుడైతే ఆఫ్ఘనిస్ధాన్ అమెరికా పర్యవేక్షణ నుండి బయటపడిందో అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. దేశంలో పాలనంతా ఆఘన్లే చూసుకుంటున్నప్పటికీ పై ఎత్తున అమెరికా మిలిటరీ పర్యవేక్షించేది కాబట్టి దేశంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగిపోయేది జీవితాలు. దాదాపు 20 సంవత్సరాలు ఆప్ఘన్లో జనాలు చాలా హ్యపీగా బతికారు. అలాంటిది ఒక్కసారిగా దేశంలో నుండి అమెరికా మిలిటరీ వెళ్ళిపోవటంతో మళ్ళీ తాలిబన్లు విజృంభించారు. అమెరికా మిలిటరీ దేశాన్ని ఖాళీ చేసే సమయం దగ్గరకు రాగానే తాలిబన్లు ప్రజా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.






ఒక్కో రాష్ట్రాన్నే స్వాధీనం చేసుకుంటు అమెరికా మిలిటరీ దేశంలో ఉండగానే యాతవ్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించేశారు. దాంతో దేశంలో మళ్ళీ అటవిక పాలన మొదలైంది. షరియా చట్టాల పేరుతో జనాలను ముఖ్యంగా మహిళలను తాలిబన్లు రాచిరంపాన పెడుతున్నారు. ఈ అటవిక పాలన  అంతమవ్వాలంటే జనాల్లో తిరుగుబాటు రావాల్సిందే. అయితే అందుకు ఇప్పట్లో  అవకాశాలు లేదనే చెప్పాలి. అందుకనే తాలిబన్ల ఆటవిక రాజ్యం యధేచ్చగా సాగుతోంది. ఎప్పుడు అంతమవుతుందో చూడాల్సిందే.







RRR Telugu Movie Review Rating

కాబూల్ మహిళలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>