Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikannab074bb4b-a566-4813-aa65-5ff117ab295c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikannab074bb4b-a566-4813-aa65-5ff117ab295c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన సినిమా ఏది అంటే ప్రతి ఒక సినీ ప్రేక్షకుడు చెప్పే పేరు బాహుబలి అని. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లో మాత్రమే కాకుండా అటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సూపర్ హిట్ సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించాయ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా సినీ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. ఇలా ప్రతిష్టాత్మకమైన మూవీగా నిలిచిన బాహుబలి సినిమా గురించి ఎప్పుడూRashikanna{#}Avantikka;avanthika;prema;raasi;tamannaah bhatia;Bahubali;Film Industry;Love Story;Katthi;Love;Rajamouli;Tollywood;Heroine;Car;Cinema;Newsబాహుబలి సినిమాలో.. అలా ఛాన్స్ మిస్సయింది : రాశిఖన్నాబాహుబలి సినిమాలో.. అలా ఛాన్స్ మిస్సయింది : రాశిఖన్నాRashikanna{#}Avantikka;avanthika;prema;raasi;tamannaah bhatia;Bahubali;Film Industry;Love Story;Katthi;Love;Rajamouli;Tollywood;Heroine;Car;Cinema;NewsThu, 09 Mar 2023 09:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన సినిమా ఏది అంటే ప్రతి ఒక సినీ ప్రేక్షకుడు చెప్పే పేరు బాహుబలి అని. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లో మాత్రమే కాకుండా అటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సూపర్ హిట్ సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించాయ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా సినీ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి.


 ఇలా ప్రతిష్టాత్మకమైన మూవీగా నిలిచిన బాహుబలి సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇక ఈ సినిమా అవకాశాన్ని కోల్పోయిన నటీనటులు గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే తాను కూడా బాహుబలిలో నటించిన అవకాశాన్ని కోల్పోయాను అంటూ చెబుతుంది గ్లామరస్ హీరోయిన్ రాసి కన్నా. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రాశి కన్నా ఇప్పటివరకు తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. బాహుబలిలో అవకాశం మిస్ అయిన విషయం గురించి మాట్లాడింది.  బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను కూడా వెళ్లాను.  అయితే అందులో తమన్న పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. కానీ సుకుమారమైన ముఖం చేతిలో కత్తి ఉండడానికి రాజమౌళి సర్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాత్రకు అందంతో పాటు రఫ్ లుక్ కూడా కావాలి. ఇక నేనైతే ప్రేమ కథలకే సరిపోతను భావించి నా స్నేహితుడు ఒకరు లవ్ స్టోరీ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళు.. అని కథ నీకు బాగా నచ్చుతుందని రాజమౌళి సర్ ఒక సలహా ఇచ్చారు అంటూ రాశి కన్నా చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

జగనన్నా.. ఆ హామీ ఏమైందంటున్న అగ్రిగోల్డ్‌ బాధితులు?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>