MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amitaab-20566bb5-dc45-4eb8-8517-1b4cbfc84666-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amitaab-20566bb5-dc45-4eb8-8517-1b4cbfc84666-415x250-IndiaHerald.jpg‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో అమితాబ్ కు గాయం తగిలి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయిలోని తన నివాసానికి అమితాబ్ వెళ్ళిపోవడంతో మళ్ళీ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కు బ్రేక్ పడింది. సుమారు 5 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఇప్పుడు అమితాబ్ కు ప్రక్కటెముక మృదులాస్థి దగ్గర గాయం అయింది అని వార్తలు వస్తున్నాయి. ఈగాయం నుండి అమితాబ్ కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుంది అని అంటున్నారు. ఇలాంటి పamitaab {#}Makar Sakranti;nag ashwin;Amitabh Bachchan;Prabhas;News;Darsakudu;Director;Cinemaఅమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?amitaab {#}Makar Sakranti;nag ashwin;Amitabh Bachchan;Prabhas;News;Darsakudu;Director;CinemaWed, 08 Mar 2023 08:18:12 GMT‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో అమితాబ్ కు గాయం తగిలి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయిలోని తన నివాసానికి అమితాబ్ వెళ్ళిపోవడంతో మళ్ళీ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కు బ్రేక్ పడింది. సుమారు 5 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.


ఇప్పుడు అమితాబ్ కు ప్రక్కటెముక మృదులాస్థి దగ్గర గాయం అయింది అని వార్తలు వస్తున్నాయి. ఈగాయం నుండి అమితాబ్ కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో అనుకున్న తేదీకి ‘ప్రాజెక్ట్ కె’ విడుదల అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించిన అమితాబ్ పాత్రకు సంబంధించి 90 శాతం చిత్రీకరణ పూర్తి అయిందని అంటున్నారు. దీనితో అమితాబ్ గాయం పూర్తిగా తగ్గడానికి మరికొంత కాలం పట్టినా సమస్య లేకుండా ఈమూవీలోని అమితాబ్ పాత్రను కొంతవరకు తగ్గించి సినిమా విడుదల తేదీకి అడ్డులేకుండా చూసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఈవిధంగా స్క్రీన్ ప్లేలో తెలివిగా మార్పులు చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ తన టీమ్ తో ఆలోచనలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా ప్రారంభం అయి రెండు సంవత్సరాలు దాటిపోవడంతో ఈమూవీ పై భారీ బడ్జెట్ పెట్టిన కారణంగా ఈమూవీ ప్రొడక్షన్ కాష్ట్ వడ్డీలతో కలుపుకుని బాగా పెరిగిపోయింది అంటున్నారు.


దీనికితోడు ప్రభాస్ సినిమాలు వరసగా రెండు ఫెయిల్ అవ్వడంతో ఈమూవీకి సంబంధించిన మార్కెటింగ్ కూడ కొంత పరిమిత స్థాయిలోనే జరుగుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ వచ్చే సంక్రాంతి రిలీజ్ డేట్ ను మిస్ చేసుకోవడం ఏమాత్రం మంచిదికాదు అని భావిస్తూ అవసరం అనుకుంటే కథలో చిన్న మార్పులు చేసి సరిపెట్టే ఆలోచనలు కూడ నాగ్ అశ్విన్ దృష్టిలో ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది..





RRR Telugu Movie Review Rating

అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>