MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankarf1cc8e69-7c43-4086-891f-6e16a49c253a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankarf1cc8e69-7c43-4086-891f-6e16a49c253a-415x250-IndiaHerald.jpgఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని.. మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోలాశంకర్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి ఎటువంటి పారితోషకం తీసుకోవడం లేదట. ఈ సినిమBholashankar{#}meher ramesh;Konidela Production;K S Ramarao;God Father;AK Entertainments;contract;shankar;Success;News;Chiranjeevi;Cinemaభోళా శంకర్ లో మెగాస్టార్ వాటా?.. ఎంతో తెలుసా..?భోళా శంకర్ లో మెగాస్టార్ వాటా?.. ఎంతో తెలుసా..?Bholashankar{#}meher ramesh;Konidela Production;K S Ramarao;God Father;AK Entertainments;contract;shankar;Success;News;Chiranjeevi;CinemaWed, 08 Mar 2023 15:45:00 GMTఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని.. మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోలాశంకర్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి ఎటువంటి పారితోషకం తీసుకోవడం లేదట. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ క్రియేటివ్ కమర్షియన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఈ సంస్థల దగ్గర నుండి ఇప్పటివరకు చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. పారితోషకంలో అడ్వాన్స్ గా కొంత ఇస్తామన్నా? ఇప్పుడేం వద్దు.. రిలీజ్ తర్వాత చూసుకుందాం అన్నాడట మెగాస్టార్.మరోవైపు బోలా శంకర్ విషయంలో ఇప్పటివరకు మెగాస్టార్ సొంత బ్యానర్ ఎక్కడా కనిపించలేదు. దీనికంటే ముందు గాడ్ ఫాదర్ ఆశ్చర్య సినిమాలకు ఇతర సంస్థలతో కలిసి కొణిదెల బ్యానర్ భాగస్వామి అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పటివరకు అడ్వాన్స్ తీసుకోకపోవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే భోళా శంకర్ విషయంలో చిరంజీవి రిలీజ్ తర్వాత నేరుగా సినిమా నుంచి లాభాలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఇది చిరు ఐడియానా? లేక నిర్మాతలే ఇలాంటి వెసులుబాటు కల్పించారా? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలో చిరంజీవి ఎన్నో సినిమాలు చేశాడు. ఆ సంస్థ అధినేత కేఎస్ రామారావు తో చిరంజీవికి ఎంతో మంచి సాన్నిహిత్యముంది. కొన్ని దశాబ్దాలుగా వీరిమధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. నష్టాలు వచ్చిన సినిమాలకు గతంలో చిరంజీవి తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి దీని ప్రకారం చూసుకుంటే నిర్మాతలే చిరంజీవికి ఈ రకంగా ఆఫర్ చేశారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి భోళా శంకర్ కోసం మెగాస్టార్ నిజంగానే వాటా తీసుకుంటున్నాడా? అనేది తెలియాలంటే దీని పై పూర్తి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే...!!



RRR Telugu Movie Review Rating

అమెరికాలో రీ రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్.... కలెక్షన్స్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>