EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrd6dbd061-d712-4c19-aff6-fffebfa6747c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrd6dbd061-d712-4c19-aff6-fffebfa6747c-415x250-IndiaHerald.jpgమహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నాయన్నారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందన్న కేసీఆర్‌.. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః అన్న ఆర్యోక్తికి అనుగుణంగా సామాజkcr{#}apoorva;Telangana;vegetable market;Traffic police;CM;KCR;police;local language;Industries;INTERNATIONALవిమెన్స్‌డే: మహిళల కోసం తెలంగాణ ఇన్ని చేస్తోందా?విమెన్స్‌డే: మహిళల కోసం తెలంగాణ ఇన్ని చేస్తోందా?kcr{#}apoorva;Telangana;vegetable market;Traffic police;CM;KCR;police;local language;Industries;INTERNATIONALWed, 08 Mar 2023 07:56:15 GMTమహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నాయన్నారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందన్న కేసీఆర్‌.. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః అన్న ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


స్త్రీశక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని...  తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,90,639 మంది లబ్దిదారుల కోసం 1261 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందినట్లు సీఎం కేసీఆర్‌  తెలిపారు. ఆసరా పథకం కింద ఒంటరి మహిళలకు 1,430 కోట్లు, వితంతువులకు 19,000కోట్లు, మహిళా బీడీ కార్మికులకు 5,393 కోట్లు ఫించనుగా పొందినట్లు సీఎం కేసీఆర్‌  పేర్కొన్నారు.


కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,03,818 మంది లబ్దిదారులకు 11,775 కోట్లు అందించినట్లు సీఎం కేసీఆర్‌  తెలిపారు. ఇప్పటి వరకు 5,75,43,664 బతుకమ్మ చీరల పంపిణీ కోసం 1,536 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం కేసీఆర్‌  చెప్పారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచామన్న సీఎం... వీహబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని అంకురాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పామన్నారు.


ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కుల నిర్వహణ ద్వారా 1500 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్ లో 10 శాతం ప్లాట్లు రిజర్వు చేసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు... సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఏఆర్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మహిళా దినోత్సవం వేళ స్వయం సహాయక సంఘాల మహిళలకు 750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు.



RRR Telugu Movie Review Rating

అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>