Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6eacabc9-abe1-438e-bac5-f5696b57aee6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6eacabc9-abe1-438e-bac5-f5696b57aee6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత స్పిన్నర్ల పేరు ఎక్కువగా మారుమోగిపోతుంది. అయితే భారత స్పిన్నర్లకు దీటుగా మంచి ప్రదర్శన చేస్తూ ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఇక భారత బ్యాట్స్మెన్లను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని చెప్పాలి. అయితే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇతను ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కలిపి ఏకCricket {#}118;Australia;Cricket;Indiaనాథన్ లియోన్.. ఇంకా కుర్రాడు లాగే ఉన్నావ్ : మైక్ హస్సినాథన్ లియోన్.. ఇంకా కుర్రాడు లాగే ఉన్నావ్ : మైక్ హస్సిCricket {#}118;Australia;Cricket;IndiaWed, 08 Mar 2023 15:00:00 GMTప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత స్పిన్నర్ల పేరు ఎక్కువగా మారుమోగిపోతుంది. అయితే భారత స్పిన్నర్లకు దీటుగా మంచి ప్రదర్శన చేస్తూ ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్.   తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఇక భారత బ్యాట్స్మెన్లను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని చెప్పాలి. అయితే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇతను ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.



 కానీ ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కలిపి ఏకంగా 18 వికెట్లు సాధించి సంచలనం సృష్టించాడు నాథన్ లియోన్. ఇక మూడో టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు తీసి ఒకరకంగా భారత ఓటమిని శాసించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక 12 ఏళ్ల టెస్ట్ కెరియర్ లో 479 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అని చెప్పాలి.  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాడు ఈ సీనియర్స్ స్పిన్నర్.  35 ఏళ్ళ నాథన్ లియోన్ ఇప్పుడు వరకు 118 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలోనే అతని కెరియర్ గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.



 నాథన్ లియోన్ సుదీర్ఘకాలం నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ కూడా ఇంకా కుర్రాడిలాగే కనిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే నాథన్ లియోన్ ఎంతకాలం వరకు కూడా ఆడాలనుకుంటే అంతవరకు కొనసాగితే మంచిది. ఏళ్లు గడుస్తున్న అతని వయసు పెరుగుతుందేమో కానీ అతని శరీరంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అంటూ మైక్ హసి చెప్పుకొచ్చాడు. చాలామంది చెప్పినట్లే స్పిన్నర్లు 30 ఏళ్లు దాటిన తర్వాతే తమ కెరియర్లో ఉన్నత స్థాయికి వెళ్తారు. మరి ముఖ్యంగా 30 దాటాక ఇంకా వేగంగా ఉంటుందేమో. స్పిన్ బౌలింగ్ చేయడం క్లిష్టమైనదే. కానీ నాథన్ లియోన్ ఇక సుదీర్ఘకాలం ఆడుతూ ముందుకు సాగాలి అంటూ మైక్ హాసి చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ కోసం బాలీవుడ్ సంస్థ అంత పెట్టుబడి పెట్టిందా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>