SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/thamalapaku-deeapamcb678055-7f90-4d17-9785-c33d4c8da72a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/thamalapaku-deeapamcb678055-7f90-4d17-9785-c33d4c8da72a-415x250-IndiaHerald.jpg మన హిందూ సంప్రదాయంలో తాంబూలనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తాంబూలం ఇవ్వడం అష్ట మంగలాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అలాగే దీపానికి వున్న ప్రాముఖ్యత చెప్పనక్కరలేదు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో, దీపారాధన ఎంతో మంచిదని మన పూర్వీకులు మనకు చెబుతూనే ఉన్నారు. కొన్ని రకాల సమస్యలకు కొన్ని పరిష్కారాలను పండితులు సూచిస్తూ ఉంటారు. చాలామంది ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ఉద్యోగం సిద్ధించక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారు తమలపాకు దీపం పెట్టడం వల్ల ఉద్యోగం సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఆ దీపాన్ని ఎలా పెట్టాలో ఇTHAMALAPAKU;DEEAPAM{#}temple;Ancestral;Betel;Maha;monday;job;Houseతమలపాకు దీపం వల్ల.. కలిగే ప్రయోజనం తెలుసా..?తమలపాకు దీపం వల్ల.. కలిగే ప్రయోజనం తెలుసా..?THAMALAPAKU;DEEAPAM{#}temple;Ancestral;Betel;Maha;monday;job;HouseWed, 08 Mar 2023 06:00:00 GMT
మన హిందూ సంప్రదాయంలో తాంబూలనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తాంబూలం ఇవ్వడం అష్ట మంగలాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అలాగే దీపానికి వున్న ప్రాముఖ్యత చెప్పనక్కరలేదు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో, దీపారాధన ఎంతో మంచిదని మన పూర్వీకులు మనకు చెబుతూనే ఉన్నారు. కొన్ని రకాల సమస్యలకు కొన్ని పరిష్కారాలను పండితులు సూచిస్తూ ఉంటారు. చాలామంది ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ఉద్యోగం సిద్ధించక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారు తమలపాకు దీపం పెట్టడం వల్ల ఉద్యోగం సిద్ధిస్తుందని పండితులు  సూచిస్తున్నారు. ఆ దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం..

 తమలపాకు దీపం పెట్టడానికి కావలసిన వస్తువులు:
ఈ దీపం పెట్టడానికి ముందుగా కావాల్సినవి 8  తమలపాకులు, బియ్యం పిండితో చేసిన ప్రమీదలు, దీపం పెట్టడానికి నువ్వుల నూనె, ఒత్తులు, పూలు, పసుపు,కుంకుమ, టెంకాయ,ఆగరబత్తిలు.

 ఈ దీపం పెట్టే విధానం:
ఈ దీపాన్ని 9 సోమవారాలపాటు, ఏదేని శివాలయంలో శివుని ముందు  పెట్టవచ్చు. ఈ తొమ్మిది సోమవారాలపాటు దీపం పెట్టడానికి ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. సోమవారం ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, న్ని తలస్నానం చేసి, ముందుగా ఇంటి దేవునికి దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్రసాదం తయారు చేసుకుని, పైన చెప్పిన వస్తువులన్నీ గుడికి తీసుకువెళ్ళాలి.శివుని గుడి ముందు  కొంచెం స్థలమును శుభ్రం చేసి, పసుపుతో అలికి,ఆరు తమలపాకులను గుండ్రంగా పరవాలి, వాటిపై బియ్యం ప్రమిదలు ఉంచి,నూనె వేసి ఒత్తులను పెట్టాలి.ఆ తర్వాత తాంబూలం పెట్టి, పండ్లు ప్రసాదాలు సమర్పించి, దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత శివారాధన చేయాలి.ఇలా తొమ్మిది సోమవారాల పాటు చేయాలి. శివుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు, ఈ విధంగా పూజిస్తే,ఆ మహా శివుని అనుగ్రహంతో కచ్చితంగా ఉద్యోగం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కావున ఉద్యోగం కోసం తపన పడే ప్రతి ఒక్కరూ ఈ పూజావిధానంను పాటించి, తమ కోర్కెలను తీర్చుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

మాజీ మంత్రి నారాయణ కూతురుకు ఊరట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>