PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyn-chandrababu-jagana6dcf62e-28d3-4ec5-a331-e821ac72f033-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyn-chandrababu-jagana6dcf62e-28d3-4ec5-a331-e821ac72f033-415x250-IndiaHerald.jpgఇంతమంది వచ్చి ఎంవోయులు కుదుర్చుకున్నారు కాబట్టి సదస్సు గ్రాండ్ సక్సెస్ అనేచెప్పాలి. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాల నోళ్ళు పడిపోయాయి. సదస్సు గ్రాండ్ సక్సెస్ అని అంగీకరించలేక కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లుగా పనికిమాలిన ఆరోపణలు ఏవేవో చేస్తున్నాయి. ఇక ఎల్లోమీడియా ఏడుపు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సదస్సులో భోజనాల దగ్గర తోపులాట జరిగింది, కిట్లు అందరికీ రాలేదనే పాయింట్లను హైలైట్ చేసి తన ఓర్వలేనితనాన్ని చాటుకుంది. janasena pawankalyn chandrababu jagan{#}sumanth;Jagan;Nadendla Manohar;Foot Ball;Anandam;Reddy;Pawan Kalyan;Mukesh;Karan Johar;News;Success;media;INTERNATIONALఅమరావతి : పవన్, చంద్రబాబుకు మొహం చెల్లటంలేదా ?అమరావతి : పవన్, చంద్రబాబుకు మొహం చెల్లటంలేదా ?janasena pawankalyn chandrababu jagan{#}sumanth;Jagan;Nadendla Manohar;Foot Ball;Anandam;Reddy;Pawan Kalyan;Mukesh;Karan Johar;News;Success;media;INTERNATIONALTue, 07 Mar 2023 03:00:00 GMT




కొద్దిరోజులుగా వీళ్ళిద్దరి ఏడిపుకి జగన్మోహన్ రెడ్డి సరైన సమాధానం చెప్పారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఏపీలో రు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది పారిశ్రామికవేత్తలు  ఎంవోయులు కుదుర్చుకున్నారు. తమ తరపున ఎవరినో పంపకుండా డైరెక్టుగా అధినేతలే సదస్పుకు రావటం చాలా కీలకమనే చెప్పాలి. ముఖేష్ అంబానీ దాదాపు 4 గంటల పాటు సదస్సులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖేష్ కాకుండా కరణ్ అదానీ, కుమారమంగళం బిర్లా, నవీన్ జిందాల్, సుమంత్ సిన్హా, గ్రంధి మల్లికార్జునరావు లాంటి ఎంతోమంది హేమాహేమీలు సదస్సులో పాల్గొన్నారు.





ఇంతమంది వచ్చి ఎంవోయులు కుదుర్చుకున్నారు కాబట్టి సదస్సు గ్రాండ్ సక్సెస్ అనేచెప్పాలి. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాల నోళ్ళు పడిపోయాయి. సదస్సు గ్రాండ్ సక్సెస్ అని అంగీకరించలేక కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లుగా పనికిమాలిన ఆరోపణలు ఏవేవో చేస్తున్నాయి. ఇక ఎల్లోమీడియా ఏడుపు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సదస్సులో భోజనాల దగ్గర తోపులాట జరిగింది, కిట్లు అందరికీ రాలేదనే పాయింట్లను హైలైట్ చేసి తన ఓర్వలేనితనాన్ని చాటుకుంది.





ఇక్కడే అందరికీ ఒక అనుమానం పెరిగిపోయింది. అదేమిటంటే సదస్సు జరిగి రెండురోజులవుతున్నా ఇంతవరకు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అసలు నోరిప్పలేదు. మామూలుగా అయితే వీళ్ళిద్దరు ఊరికే ఉండే రకాలు కాదు. జగన్ కు వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతుంటారు.





అలాంటి పెట్టుబడుల సదస్సుపై మాట్లాడటానికి ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. పైగా వీళ్ళు రాకుండా అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇక్కడే వీళ్ళ ఏడుపేమిటో అర్ధమైపోతోంది. సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అంగీకరించలేరు, అలాగని ఫెయిలయ్యిందంటే జనాలు నవ్వుతారు. దాంతో ఏమి మాట్లాడలేక తమ నేతలతో మాట్లాడిస్తు, ఎల్లోమీడియాలో వ్యతిరేక వార్తలు రాయించుకుంటు ఆనందం పొందుతున్నట్లు అనిపిస్తోంది. లేకపోతే ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ను ఫుట్ బాల్ ఆడుకునేందుకు దొరికిన అవకాశాన్ని వదులుకుంటారా ?




RRR Telugu Movie Review Rating

అమరావతి : పవన్, చంద్రబాబుకు మొహం చెల్లటంలేదా ?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>