MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ఇండస్ట్రీలో తలలు పండినవారు కూడ విడుదలకు ముందు ఏసినిమా హిట్ ఏసినిమా ఫ్లాప్ అవుతుంది అన్న అంచనాలు వేయలేదు. ఆ సీక్రెట్ తెలిస్తే అందరూ సక్సస్ సినిమాలనే తీస్తారు. ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు ఎవరూ ఊహించని అనూహ్య విజయాలను సాధిస్తున్నాయి. తెలుగు సినిమాలకు సంబంధించి కొంతకాలం క్రితం విడుదలైన ‘జాతిరత్నాలు’ ‘డిజే టిల్లు’ ఎలాంటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడు అలాంటి ఒక చిన్న సినిమా మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. నెలరోజుల క్రితం మళయాళంలో విడుదలైనTOLLLYWOOD{#}Madhavan;GEUM;Remake;Audience;Telugu;News;Cinema;Heroషాకింగ్ 2 కోట్లకు 50 కోట్లు వసూళ్లు !షాకింగ్ 2 కోట్లకు 50 కోట్లు వసూళ్లు !TOLLLYWOOD{#}Madhavan;GEUM;Remake;Audience;Telugu;News;Cinema;HeroTue, 07 Mar 2023 08:02:44 GMT
ఇండస్ట్రీలో తలలు పండినవారు కూడ విడుదలకు ముందు ఏసినిమా హిట్ ఏసినిమా ఫ్లాప్ అవుతుంది అన్న అంచనాలు వేయలేదు. ఆ సీక్రెట్ తెలిస్తే అందరూ సక్సస్ సినిమాలనే తీస్తారు. ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు ఎవరూ ఊహించని అనూహ్య విజయాలను సాధిస్తున్నాయి. తెలుగు సినిమాలకు సంబంధించి కొంతకాలం క్రితం విడుదలైన ‘జాతిరత్నాలు’ ‘డిజే టిల్లు’ ఎలాంటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

 

 
ఇప్పుడు అలాంటి ఒక చిన్న సినిమా మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. నెలరోజుల క్రితం మళయాళంలో విడుదలైన ‘రోమంచమ్’ మూవీ సృష్టిస్తున్న రికార్డులు దక్షిణాది సినిమా రంగంలో షాకింగ్ గా మారాయి. ఈమూవీలో పేరున్న హీరో ఎవరు నటించలేదు. బట్టతలతో పొట్టిగా ఉండే షాహిర్ అనే నటుడు ఈమూవీలో నటించాడు.

 

 
ఈమూవీ కేవలం 2 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఇప్పటివరకు 55 కోట్ల కలక్షన్స్ ను రాబట్టిందని వార్తలు వస్తున్నాయి. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ కం హారర్ థ్రిల్లర్. ఈమూవీ కథ 2007 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతోందనే ఉద్దేశంతో సరదాగా ‘ఔజా’ గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఏమిటంటే ఒక బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడ్డం. ఏదో సరదా కోసం మొదలుపెట్టిన ఈ గేమ్ ఎవరూ ఊహించని ట్విస్ట్ లు తీసుకుని ప్రేక్షకులను ఆసినిమా చూస్తున్నంత సేపు తరువాత రాబోయే సీన్ ఏమిటి అన్న ఆలోచనల వైపు తీసుకువెడుతుంది.

 

 
ఇప్పుడు ఈమూవీ సూపర్ సక్సస్ కావడంతో ఈమూవీని రీమేక్ చేయడానికి మన తెలుగు ఇండస్ట్రీ నుండి అనేకమంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమూవీ నిర్మాతలు చెపుతున్న రేటుకు భయపడి చాలామంది వెనకడుగు వేస్తున్నారు అన్న మాటలు కూడ ఉన్నాయి. క్రియేటివిటీ ఉంటే చాలు ప్రేక్షకులు పెద్ద సినిమా చిన్న సినిమా అన్నది చూడటంలేదు అన్న విషయానికి ఒక ఉదాహరణ..





RRR Telugu Movie Review Rating

"కస్టడీ" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన నాగ చైతన్య..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>