SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023-up-vs-gg95c81fba-63d0-46cd-bf77-614a30e09a61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023-up-vs-gg95c81fba-63d0-46cd-bf77-614a30e09a61-415x250-IndiaHerald.jpgమహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ మార్చ్ 4 వ తేదీ నుండి మొదలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం అయిదు జట్లు మొదటి టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ జాయింట్స్, యూపీ వారియర్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించాయి.WPL-2023-UP VS GG{#}kiran;swetha;Mumbai;Cricket;Gujarat - Gandhinagar;Australia;rana daggubati;Delhiవారెవ్వా... స్టన్నింగ్ బ్యాటింగ్ 18 బంతుల్లో 53 పరుగులు !వారెవ్వా... స్టన్నింగ్ బ్యాటింగ్ 18 బంతుల్లో 53 పరుగులు !WPL-2023-UP VS GG{#}kiran;swetha;Mumbai;Cricket;Gujarat - Gandhinagar;Australia;rana daggubati;DelhiMon, 06 Mar 2023 10:59:34 GMTహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ మార్చ్ 4 వ తేదీ నుండి మొదలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం అయిదు జట్లు మొదటి టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ జాయింట్స్, యూపీ వారియర్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించాయి. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ అయితే కనీ వినీ ఎరుగని రీతిలో క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది. గుజరాత్ జయింట్స్ మరియు యూపీ వారియర్స్ జట్ల మధ్య జరిగిన డే నైట్ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా బ్యాటింగ్ తీసుకుంది.

కానీ పవర్ ప్లే తర్వాత ఆశించిన స్థాయిలో గుజరాత్ ఇన్నింగ్స్ నడవలేదు. ఒకానొక దశలో కనీసం 150 పరుగులు చేస్తుందా అనిపించింది. కనీ హర్లీన్ డియోల్ 46, గార్డెనర్ 25 మరియు  హేమలతలు 21 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో చేధనను ఆరంభించిన యూపీ వారియర్స్ ఫేవరిట్స్ అనే అంతా అనుకున్నారు. యూపీ వారియర్స్ కు ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ ను చూస్తే ఈ స్కోర్ ను ఛేదించడం సులభమే అనుకున్నారు.

కానీ ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఒకే ఓవర్ లో కెప్టెన్ హీలీ 7, శ్వేతా 5 మరియు మెక్ గ్రాత్ లను అవుట్ చేసి గుజరాత్ ను రేస్ లో నిలిపింది. ఇక యూపీ గెలవడం అసాధ్యం అనుకున్న సమయంలో కిరణ్ 53 గ్రేస్ హారిస్ 59 నాట్ అవుట్ మరియు సోపీ 22 పరుగులు చేసి యూపీ వారియర్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. చివరి మూడు ఓవర్ లకు 53 పరుగులు అవసరం అయిన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగి యూపీ ని విజయతీరాలకు చేర్చింది. దీనితో గుజరాత్ జాయింట్స్ కు వరుసగా రెండవ ఓటమి ఎదురైంది.  





RRR Telugu Movie Review Rating

రావణాసుర టీజర్ పై స్పందించిన డైరెక్టర్ బాబీ..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>