PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-nandendla-jagan-vizag-gisc4e5e13b-02b6-4a5e-b842-99b5503c56d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-nandendla-jagan-vizag-gisc4e5e13b-02b6-4a5e-b842-99b5503c56d9-415x250-IndiaHerald.jpgరాజమండ్రిలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడికూడా రాకూడదు, రాష్ట్రం నాశనమైపోవాల్సిందే అన్నట్లుగా ఉంది. అసలా ఆ శాపనార్ధాలు ఏమిటో అర్ధంకావటంలేదు. సదస్సుకు హాజరైన ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడులు పెడతామని ఎక్కడ ప్రకటించారని విచిత్రమైన ప్రశ్నవేశారు. అంబానీ మాట్లాడుతు ఏపీలో 10 గీగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని చేసింది ప్రకటన కాదా. కొన్ని పరిశ్రమలు ఇఫ్పటికే నడుస్తున్నాయని అవి ప్రకటించింది పెట్టుబడులు ఎలాగవjanasena nandendla jagan vizag GIS{#}Mukesh;Nadendla Manohar;Janasena;contract;Reddy;Government;Industriesఅమరావతి : జనసేనకు కావాల్సింది రాష్ట్రం నాశనమైపోవటమేనా ?అమరావతి : జనసేనకు కావాల్సింది రాష్ట్రం నాశనమైపోవటమేనా ?janasena nandendla jagan vizag GIS{#}Mukesh;Nadendla Manohar;Janasena;contract;Reddy;Government;IndustriesMon, 06 Mar 2023 05:00:00 GMT



ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పెట్టుబడులు రావటంలేదు, తీసుకురావటం చేతకాలేదన్నారు. పెట్టుబడుల కోసం ఒక సదస్సు పెడితే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటు ఏడుస్తున్నారు. సదస్సులో రు. 13.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రకటిస్తే అంతా మోసమని, జనాలను మభ్యపెడుతున్నారంటు గోల చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియా ఏడుపేమిటో ? వాళ్ళకి  ఏమికావాలో అర్ధంకావటంలేదు.





రాజమండ్రిలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడికూడా రాకూడదు, రాష్ట్రం నాశనమైపోవాల్సిందే అన్నట్లుగా ఉంది. అసలా ఆ శాపనార్ధాలు ఏమిటో అర్ధంకావటంలేదు. సదస్సుకు హాజరైన ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడులు పెడతామని ఎక్కడ ప్రకటించారని విచిత్రమైన ప్రశ్నవేశారు. అంబానీ మాట్లాడుతు ఏపీలో 10 గీగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని చేసింది ప్రకటన కాదా. కొన్ని పరిశ్రమలు ఇఫ్పటికే నడుస్తున్నాయని అవి ప్రకటించింది పెట్టుబడులు ఎలాగవుతాయని నాదెండ్ల అడగటమే విచిత్రంగా ఉంది.





ఇప్పటికే ఉన్న పరిశ్రమలు విస్తరణ చేయకూడదా ? విస్తరణ కోసం చేసే ఖర్చు కూడా పెట్టుబడే కదా. శ్రీసిటిలో పరిశ్రమలకు ప్రభుత్వానికి సంబంధంలేదనటం నాదెండ్ల అజ్ఞానానికి నిదర్శనమే. శ్రీసిటి సెజ్ ను ఏర్పాటుచేసింది ప్రభుత్వమే  కదా. శ్రీసిటి సెజ్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలో భాగమే కదా.





పెట్టుబడులు ప్రకటించారే కానీ ఎంవోయులకే పరిమితయ్యారని మరో పిచ్చిలాజిక్ లేవదీశారు. ఎవరైనా ఎంవోయులు కుదుర్చుకుని తర్వాతే కదా పెట్టుబడులు పెడతారు. పెట్టుబడుల సదస్సు అనగానే బస్తాలతో వందలు, వేల కోట్లరూపాయలను తీసుకొచ్చి వేదికమీద కుమ్మరిస్తారా ? ఇన్ని సంవత్సరాల్లో ఇంత పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఏ సదస్సులో చేసుకున్న ఒప్పందాలైనా నూరుశాతం కార్యరూపంలోకి రావని అందరికీ తెలిసిందే. అయినా నాదెండ్ల ఏడుపు ఏమిటంటే ఒప్పందాలు జరిగిన లక్షల కోట్ల రూపాయల ఎక్కడ కార్యరూపంలోకి వచ్చేస్తాయో అన్నట్లుంది.  




RRR Telugu Movie Review Rating

అమరావతి : జనసేనకు కావాల్సింది రాష్ట్రం నాశనమైపోవటమేనా ?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>