PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ippatam-janasena-pawan-706863e9-5704-4053-83e6-adb04efd464a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ippatam-janasena-pawan-706863e9-5704-4053-83e6-adb04efd464a-415x250-IndiaHerald.jpgరోడ్లు, కట్టుకున్న ఇళ్ళు, ఆక్రమించిన ప్రహరిగోడ స్ధలాలన్నింటినీ అధికారులు రికార్డులతో సహా పార్టీల నేతలకు చూపించారు. దాంతో చేసేదేమీ లేక కాకిగోల మొదలుపెట్టారు. దాంతో పోలీసులు జోక్యంచేసుకుని సర్దిచెప్పే ప్రయత్నంచేసినపుడు కావాలనే గోల చేశారు. అధికారుల విధులకు అడ్డపడటం, పోలీసులతో వాగ్వాదం మొదలైన పనికిమాలిన పనులన్నీ చేశారు. ఇక చేసేదిలేక పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో జనసేన నేతలంతా వెంటనే పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళిపోయారు. ippatam janasena pawan {#}Pawan Kalyan;Guntur;Janasena;court;police;Saturday;Party;TDP;village;local languageఅమరావతి : పరువు పోగొట్టుకున్న జనసేనఅమరావతి : పరువు పోగొట్టుకున్న జనసేనippatam janasena pawan {#}Pawan Kalyan;Guntur;Janasena;court;police;Saturday;Party;TDP;village;local languageMon, 06 Mar 2023 03:00:00 GMT




అతిచేస్తే గతిచెతుందనే సామెత జనసేన నేతలకు సరిగ్గా సరిపోతుంది. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామం ఇపుడు వార్తల్లో బాగా నలుగుతోంది. కారణం ఏమిటంటే రోడ్డును ఆక్రమించుకుని కట్టుకున్న ఇళ్ళ ప్రహరీగోడలను అధికారులు తొలగించాలని ప్రయత్నించటమే. ప్రహరీగోడలను తొలగించాలని అనుకోవటం ఇదే మొదటిసారి కాదు. ఆమధ్య ప్రయత్నించినపుడు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గ్రామానికి వెళ్ళి చేసిన ఓవర్ యాక్షన్ అందరు చూసిందే.





ఆ తర్వాత బాధితులంటు కొందరి తరపున కోర్టులో కేసువేయటం వాస్తవాలు తెలుసుకుని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసి జరిమానా విధించటంతో పవన్ పరువంతా పోయింది. అప్పట్లో ఆగిపోయిన తొలగింపులను అధికారులు శనివారం మొదలుపెట్టారు. వెంటనే జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యక్షమైపోయారు. అధికారులతో గొడవలు పడ్డారు. తొలగిస్తున్నవన్నీ ఆక్రమణలే అని, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని గ్యారెంటీ ఏమిటంటు పిచ్చి వాదనకు దిగారు.





రోడ్లు, కట్టుకున్న ఇళ్ళు, ఆక్రమించిన ప్రహరిగోడ స్ధలాలన్నింటినీ అధికారులు రికార్డులతో సహా పార్టీల నేతలకు చూపించారు. దాంతో చేసేదేమీ లేక కాకిగోల మొదలుపెట్టారు. దాంతో పోలీసులు జోక్యంచేసుకుని సర్దిచెప్పే ప్రయత్నంచేసినపుడు కావాలనే గోల చేశారు. అధికారుల విధులకు అడ్డపడటం, పోలీసులతో వాగ్వాదం మొదలైన పనికిమాలిన పనులన్నీ చేశారు. ఇక చేసేదిలేక పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో జనసేన నేతలంతా వెంటనే పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళిపోయారు.





గుడిలోకి వెళ్ళిన నేతలు తలుపులకు తాళాలు వేసుకుని గోలచేయటం మొదలుపెట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన జనసేన నేతలు గుడిలోకి ఎందుకు వెళ్ళారు, తాళాలు ఎందుకు వేసుకున్నారో ఎవరికీ అర్ధంకాలేదు. ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే జనసేన, టీడీపీ నేతలు ఇప్పటంలో రబస సృష్టించారని అందరికీ తెలుస్తునే ఉంది. అధికారులు తొలగిస్తున్నది కేవలం ఆక్రమణలైన ప్రహరిగోడలను మాత్రమే అని తేలిపోయింది. లోకల్ గా ఉన్న గ్రామస్తులు పార్టీల జనాలతో తమకేమీ సంబంధంలేదని తెగేసి చెబుతున్నారు. దాంతో పరువు పోగొట్టుకున్న జనసేన నేతలు గుడిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవటం విచిత్రంగానే ఉంది.





RRR Telugu Movie Review Rating

అమరావతి : పరువు పోగొట్టుకున్న జనసేన

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>