LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health498f4e2f-9f4e-493a-ba14-ea4a102d1e7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health498f4e2f-9f4e-493a-ba14-ea4a102d1e7a-415x250-IndiaHerald.jpgవయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు బారిన పడాల్సిందే. ఈ సమస్యలు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వరం ఇంకా తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది కూడా ఈ జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్ లను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఉపశమనం ఉన్నా కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఈ సమస్యలకు ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసHEALTH{#}thulasi;Tulasi;Ginger;Cinnamon;Shakti;Manam;Jaggeryజలుబు, దగ్గు, గొంతు నొప్పిని నివారించే టిప్?జలుబు, దగ్గు, గొంతు నొప్పిని నివారించే టిప్?HEALTH{#}thulasi;Tulasi;Ginger;Cinnamon;Shakti;Manam;JaggerySun, 05 Mar 2023 20:49:42 GMTవయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో  జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు బారిన పడాల్సిందే. ఈ సమస్యలు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వరం ఇంకా తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది కూడా ఈ జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్ లను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఉపశమనం ఉన్నా కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఈ సమస్యలకు ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీటిని తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక బిర్యానీ ఆకు ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తరువాత 4 మిరియాలను, 2 యాలకులను, 4 లవంగాలను పొడిగా చేసి ఆ నీటిలో వేసుకోవాలి.ఆ తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ నల్ల ఉప్పును, 6 నుండి 7 తులసి ఆకులను , ఒక చిన్న నల్ల బెల్లం ముక్కను, అర టీ స్పూన్ వామును ఇంకా అర టీ స్పూన్ దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి.


తరువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించి తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి.ఆ తరువాత ఈ నీటిని సగం అయ్యే దాకా బాగా మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు పూటలా పూటకు ఒక కప్పు మోతాదులో గోరు వెచ్చగా తాగాలి.ఇలా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో పేరుకుపోయిన కఫం ఇంకా అలాగే ఛాతిలో మంట వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. అందువల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

SSMB29: జక్కన్న ప్లాన్ కి మతిపోవాల్సిందే?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?

యు అండ్ ఐ.. శ్రీయ గ్లామర్ ఎటాక్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>