PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-jagan-hit-a-severe-blow-to-janasena-chief-pawan1a57917e-5f20-479a-aade-f1e83068110f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-jagan-hit-a-severe-blow-to-janasena-chief-pawan1a57917e-5f20-479a-aade-f1e83068110f-415x250-IndiaHerald.jpgఇవన్నింటినీ పక్కనపెట్టేస్తే సదస్సు నిర్వహణపై గురువారం పవన్ ట్వీట్లుచేశారు. సదస్సు ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టి అన్నీ విధాలుగా అభివృద్ధికి సహకరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల కన్నా తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని తేల్చిచెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న కారణంగా రెండురోజులు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయదలచుకోలేదన్నారు. జగన్ అంటే పవన్ కు ఎంత మంటుందో అందరికీ తెలుసు. janasena pawankalyan jagan yellow batch{#}Janasena;Vishakapatnam;Jagan;Friday;Kanna Lakshminarayana;thursday;INTERNATIONAL;Pawan Kalyanఅమరావతి : ఎల్లో బ్యాచ్ కు పవన్ షాకిచ్చారా ?అమరావతి : ఎల్లో బ్యాచ్ కు పవన్ షాకిచ్చారా ?janasena pawankalyan jagan yellow batch{#}Janasena;Vishakapatnam;Jagan;Friday;Kanna Lakshminarayana;thursday;INTERNATIONAL;Pawan KalyanSat, 04 Mar 2023 05:00:00 GMT


యావత్ ఎల్లోబ్యాచ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా షాకిచ్చారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే అవుననే సమాధానమొస్తోంది. ఎలాగంటే వైజాగ్ లో రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మొదలైన విషయం తెలిసిందే. శుక్రవారం మొదటిరోజు ఘనంగానే ముగిసింది. చాలామంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయమై సానుకూలంగా మాట్లాడారు. అందరు జగన్మోహన్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు.





ఇవన్నింటినీ పక్కనపెట్టేస్తే సదస్సు నిర్వహణపై గురువారం పవన్ ట్వీట్లుచేశారు. సదస్సు ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టి అన్నీ విధాలుగా అభివృద్ధికి సహకరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల కన్నా తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని తేల్చిచెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న కారణంగా రెండురోజులు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయదలచుకోలేదన్నారు. జగన్ అంటే పవన్ కు ఎంత మంటుందో అందరికీ తెలుసు. లోలోపల ఏమున్నా పైకి మాత్రం హుందాగా వ్యవహరించారు.





అయితే అభివృద్ధిని, పెట్టుబడుల సదస్సు గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మరిక్కడే ఎల్లోబ్యాచ్ కు బాగా కాలుంటుంది. ఎందుకంటే సదస్సు ఫెయిలవ్వాలని, పెట్టుబుడులు రాకూడదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు రాష్ట్రం ఏ విధంగా కూడా డెవలప్ కాకూడదని చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా గట్టిగా కోరుకుంటోంది. గురువారం అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు, శుక్రవారం ఎల్లోమీడియాలో అచ్చయిన రాతలే దీనికి నిదర్శనం.





ఒకవైపు ఎల్లోబ్యాచ్ సదస్సు ఫెయిలవ్వాలన్నట్లుగా మాట్లాడుతుంటే పవన్ మాత్రం విజయం సాధించాలని ట్వీట్ చేయటం ఏమిటి ? జనాల దృష్టిలో పవన్ మంచివాడుగాను, చంద్రబాబు, ఎల్లోమీడియా విలన్లుగా ముద్రపడిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా పవన్ నుండి ఇలాంటి ట్వీట్లు వస్తుందని ఎల్లోబ్యాచ్ ఊహించినట్లు లేదు. వారంరోజులుగా సదస్సు నిర్వహణపై  ఎల్లోమీడియా మ్యాగ్జిమమ్ బురదచల్లేసింది. అయినా పవన్ వాటిని  పట్టించుకోకుండా ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు పెట్టడమంటే ఎల్లోబ్యాచ్ కు షాక్ తగలటం కాకుండా మరేమిటి ?






RRR Telugu Movie Review Rating

బాలికపై లైంగిక దాడి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>