EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan3d8b75dd-a316-456d-bf2f-172a6efdbe0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan3d8b75dd-a316-456d-bf2f-172a6efdbe0c-415x250-IndiaHerald.jpgమాకు నచ్చిన వారు అధికారంలో ఉంటేనే అనుకూలమైన వార్తలు రాస్తూ మిగతా పార్టీలు అధికారంలోకి వస్తే పూర్తిగా ఏకపక్షంగా వ్యతిరేకంగా వార్తలు రాయడంలో టీడీపీ అనుకూల పత్రికల తర్వాతనే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. రెచ్చగొట్టే వార్తలతో ఆ పెట్టుబడుల సదస్సును సరిగా నడవకుండా విషం చిమ్మే వార్తలను ఈ రెండు పత్రికలు రాస్తున్నాయి. రోజు ఎలాగో వ్యతిరేకంగా రాసే వార్తలయినప్పటికీ సమ్మిట్ నడిచే సమయంలో మరింత దూకుడును పెంచి ఇష్టారీతిన రాయడం మొదలు పెట్టాయి. తెలంగాణ, ఆంధ్ర విడిపోJAGAN{#}Hyderabad;you tube;media;News;YCP;TDP;Nijamఆంధ్రాపై ఈ రెండు రోజులు విషమే జల్లుతారా?ఆంధ్రాపై ఈ రెండు రోజులు విషమే జల్లుతారా?JAGAN{#}Hyderabad;you tube;media;News;YCP;TDP;NijamSat, 04 Mar 2023 08:35:16 GMTమాకు నచ్చిన వారు అధికారంలో ఉంటేనే అనుకూలమైన వార్తలు రాస్తూ మిగతా పార్టీలు అధికారంలోకి వస్తే పూర్తిగా ఏకపక్షంగా వ్యతిరేకంగా వార్తలు రాయడంలో టీడీపీ అనుకూల పత్రికల తర్వాతనే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. రెచ్చగొట్టే వార్తలతో ఆ పెట్టుబడుల సదస్సును సరిగా నడవకుండా విషం చిమ్మే వార్తలను ఈ రెండు పత్రికలు రాస్తున్నాయి. రోజు ఎలాగో వ్యతిరేకంగా రాసే వార్తలయినప్పటికీ సమ్మిట్ నడిచే సమయంలో మరింత దూకుడును పెంచి ఇష్టారీతిన రాయడం మొదలు పెట్టాయి.


తెలంగాణ, ఆంధ్ర విడిపోయాక సదరు పత్రికల యజమానులు తమ సంస్థలను  ఆంధ్రకు ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.  హైదరాబాద్ లో వీరి ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలికే వార్తలు రాస్తూ ఆంధ్రలో మాత్రం వైసీపీ అధికారంలోకి రాగానే విషం చిమ్మే వార్తలు రాస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో విష భావజాలాన్ని నింపేందుకు ఈ రెండు పత్రికలు శాయశక్తులా కృషి చేస్తున్నాయనేవారికి కొదువ లేదు.


తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగినా మంచిని ఎలా రాశాయో.. చెడు జరిగితే దాన్ని రాయాలి. కానీ అలా రాయలేదు. వైసీపీ హయాంలో మంచి జరిగితే  రాయాలి. కానీ ఏకపక్షంగా వ్యతిరేకమైన వార్తల్నే రాస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇది సరైన జర్నలిజం అనిపించుకోదు.


పెట్టుబడుల సదస్సుకు అంబానీ, అదానీలు వచ్చినా వీరు ఏమీ రాయలేరు. గ్లోబల్ సమ్మిట్ కు ఎవరూ రావడం లేదని రాయడం మొదలెట్టారు. జనం ఒకప్పటిలాగా పత్రికల్లో వచ్చింది మాత్రమే నిజం అనుకోవడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం. నిమిషాల్లో ప్రతి సమాచారం స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రజల్లోకి చేరిపోతుంది. అందరూ అన్ని గమనిస్తున్నారు. ఒకరు విష ప్రచారం చేసినా మిగతా 100 యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని వందల సోషల్ ప్లాట్ ఫాంలలో వచ్చే వార్తల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు.





RRR Telugu Movie Review Rating

#NTR 30 నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రివీల్..!

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>