PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mukesh-ambani-vizag-1dfc1da5-479d-4a4e-96e4-b94247bc8c90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mukesh-ambani-vizag-1dfc1da5-479d-4a4e-96e4-b94247bc8c90-415x250-IndiaHerald.jpgవీళ్ళందరి ఏడుపులే ఆశీస్సులుగా మొదటిరోజు సదస్సు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఎంతలా అంటే మొదటిరోజే రు. 13 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదిరేంతగా. రెండోరోజు మరో రు. 10 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదరచ్చని అంచనా వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ఎంవోయులు కుదుర్చుకోవటమే కాకుండా అవన్నీ వాస్తవరూపంలోకి వచ్చేట్లుగా జగన్ ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. jagan mukesh ambani vizag {#}Mukesh;ATCHANNAIDU KINJARAPU;Vishakapatnam;Jagan;Friday;INTERNATIONAL;Success;Relianceఉత్తరాంధ్ర : ఎల్లోమీడియా ఏడుపు అంతా ఇంతా కాదా ?ఉత్తరాంధ్ర : ఎల్లోమీడియా ఏడుపు అంతా ఇంతా కాదా ?jagan mukesh ambani vizag {#}Mukesh;ATCHANNAIDU KINJARAPU;Vishakapatnam;Jagan;Friday;INTERNATIONAL;Success;RelianceSat, 04 Mar 2023 03:00:00 GMT


పాపం ఎల్లో బ్యాచ్ బాధ వర్ణనాతీతం. గుండెలు పగిలేలా ఏడుస్తుంటారు. ఎందుకంటే విశాఖపట్నంలో శుక్రవారం మొదలైన రెండురోజుల గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయినందుకు. సమ్మిట్ ఫెయిలవ్వాలని, జగన్మోహన్ రెడ్డికి మంచిపేరు రాకూడదని ఎల్లోమీడియా ఏడుపు అంతా ఇంతా కాదు. దాదాపు పదిరోజుల నుండి వరుసబెట్టి నెగిటివ్ స్టోరీలు కుమ్మింది కుమ్మిందే. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు సదస్సు సక్సెస్ కాదని పదే పదే చెప్పారు. శుక్రవారం కూడా వీళ్ళ ఏడుపు ఓ రేంజిలో సాగింది. 





వీళ్ళందరి ఏడుపులే ఆశీస్సులుగా మొదటిరోజు సదస్సు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఎంతలా అంటే మొదటిరోజే రు. 13 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదిరేంతగా. రెండోరోజు మరో రు. 10 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదరచ్చని అంచనా వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ఎంవోయులు కుదుర్చుకోవటమే కాకుండా అవన్నీ వాస్తవరూపంలోకి వచ్చేట్లుగా జగన్ ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.





ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ ముఖేష్  అంబానీ హైలైట్ గా నిలిచారు. ఇప్పటికే దక్షిణాదిలో జరిగిన ఏ సదస్సుకు ముఖేష్ హాజరుకాలేదట. అలాంటిది ఇపుడు వైజాగ్ రావటమే కాకుండా జగన్ను చూడగానే ముఖేష్ గట్టిగా హత్తుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో విశాఖ వచ్చిన దగ్గర నుండి జగన్ను ముఖేష్ ఒక్కనిముషం కూడా వదలలేదు.





మిగిలిన పారిశ్రామికవేత్తలు కూడా జగన్ను వరసబెట్టి అభినందించారు. చాలామంది పారిశ్రామిక దిగ్గజాలు జగన్ను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు వేలకోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించారు. ఇదంతా చూసిన తర్వాత ఎల్లోబ్యాచ్ కు ఇక ఏడుపు ఆగుండదనటంలో అతిశయోక్తిలేదు. ఏదైతే జరగకూడదని మొత్తం ఎల్లోబ్యాచ్ అనుకుంటున్నదో దానికి విరుద్ధంగా జరిగింది. ఎల్లోబ్యాచ్ ఏడుస్తున్నదంటేనే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు సూపర్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఇక మిగిలింది ఏమిటంటే లక్షల కోట్ల రూపాయల వివులైన ఎంవోయులు వాస్తవరూపంలోకి రావటమే.




RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : ఎల్లోమీడియా ఏడుపు అంతా ఇంతా కాదా ?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?

రష్యాదే పైచేయి.. అమెరికా పనైపోయిందా?

వారెవా: కొత్త దంపతులకు చైనా బంపర్‌ ఆఫర్‌?

ఉక్రెయిన్‌వార్‌: అమెరికాకు షాక్‌ ఇచ్చిన నివేదిక?

ఉక్రెయిన్‌ వార్‌.. భారత్‌పై ఆ దేశం ఒత్తిడి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>