MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood377c1058-680c-4cf1-b4a1-d56ff063b4a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood377c1058-680c-4cf1-b4a1-d56ff063b4a8-415x250-IndiaHerald.jpgఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పాన్ ఇండియా హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. త్రిబుల్ ఆర్ తోనే ఆమె తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో సీత పాత్రలో ఆలియా భట్ కనిపించగా.. సినిమాలో ఆమెది చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదు. అయితే ఈ సినిమా మొత్తంలో ఆమె కనిపించిన సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకుంది. అయితే రామ్ చరణ్ అలియాఫట్ మధ్య కొన్ని సీన్స్ ని రాజమౌళి షూట్ చేశారట. tollywood{#}ram pothineni;Alia Bhatt;Oscar;Rajamouli;Ram Charan Teja;seetha;March;Kumaar;India;Jr NTR;bollywood;Telugu;Cinema'ఆర్ ఆర్ ఆర్' లో ఆ పాట ఉంటే బాగుండేదట..!!'ఆర్ ఆర్ ఆర్' లో ఆ పాట ఉంటే బాగుండేదట..!!tollywood{#}ram pothineni;Alia Bhatt;Oscar;Rajamouli;Ram Charan Teja;seetha;March;Kumaar;India;Jr NTR;bollywood;Telugu;CinemaSat, 04 Mar 2023 16:35:00 GMTఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పాన్ ఇండియా హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. త్రిబుల్ ఆర్ తోనే ఆమె తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో సీత పాత్రలో ఆలియా భట్ కనిపించగా.. సినిమాలో ఆమెది చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదు. అయితే ఈ సినిమా మొత్తంలో ఆమె కనిపించిన సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకుంది. అయితే రామ్ చరణ్ అలియాఫట్ మధ్య కొన్ని సీన్స్ ని రాజమౌళి షూట్ చేశారట. కానీ చివరగా సినిమాల్లో దాన్ని యాడ్ చేయలేదు. ఇదే విషయంపై గతంలో ఆలియా భట్ రాజమౌళి పై 

అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చెర్రీ, ఆలియా ల మధ్య సీన్స్ మాత్రమే కాదు ఒక డ్యూయెట్ సాంగ్ కూడా ఉంటుందట. దీని గురించి ఆలియా భట్ కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ లో చెప్పింది. కానీ చివరగా సినిమాలో మాత్రం వీరిద్దరి మధ్య ఎలాంటి పాట లేదు. తాజాగా ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం రాంచరణ్ ,అలియా భట్ మధ్య ఉండే సాంగ్ కూడా ఉండుంటే బాగుండేదని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రిపులర్ విదేశాల్లో రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ట్రిపులర్ సినిమా పాటలకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన 'నాటు నాటు' అనే పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని కూడా అందుకొని ఏకంగా ఆస్కార్ కి సైతం నామినేట్ అయింది.

 ఈ క్రమంలోనే సినిమాలో రాంచరణ్ ,అలియా భట్ మధ్య ఉండే అందమైన డ్యూయెట్ కూడా ఉండి ఉంటే ఆ సాంగ్ కి కూడా అంతే ఆదరణ లభించి ఉండేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా రాజమౌళి ఆ పాటని విడుదల చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ డ్యూయెట్ ని మూవీ టీం రిలీజ్ చేస్తే మరింత ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మూవీ టీం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 13న జరిగే ఆస్కార్ వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కార్తికేయ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కీరవాణి తదితరులు వెళ్లడం జరిగింది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లబోతున్నాడు...!!



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ - దేవిశ్రీప్రసాద్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా..?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>