EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp781a3ddb-325f-4bdb-b48d-16ded247ee97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp781a3ddb-325f-4bdb-b48d-16ded247ee97-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఆంధ్రపదేశ్ లో ఒక సర్వే చేయించుకుంది. ఆ సర్వేలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో 135 స్థానాల్లో గెలుపొందుతుందని, వైసీపీ 15 స్థానాల్లో గెలుస్తుందని, జనసేన, తదితరులకు మిగతా సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే లో తేలిందని టీడీపీ నాయకులు బయటకు చెప్పుకున్నారు. ఆ సర్వే ఎవరూ చేశారు.. దాంట్లో నిజమెంత అబద్దమెంత అనే దాని గురించి పక్కన బెడితే రాజకీయంగా ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి ఇలాంటి సర్వేలు పనిచేస్తుంటాయి. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో జగన్ ఓడిపోతున్నారని దాన్ని చూసి జగన్ ఉలికిపడ్డట్లు ఆంధ్YCP{#}Telugu Desam Party;GEUM;Survey;October;Vemuri Radhakrishna;Prashant Kishor;Andhra Jyothi;Jagan;TDP;YCP;Hanu Raghavapudi;media;Partyవైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?YCP{#}Telugu Desam Party;GEUM;Survey;October;Vemuri Radhakrishna;Prashant Kishor;Andhra Jyothi;Jagan;TDP;YCP;Hanu Raghavapudi;media;PartySat, 04 Mar 2023 05:00:00 GMTతెలుగుదేశం పార్టీ ఆంధ్రపదేశ్ లో ఒక సర్వే చేయించుకుంది. ఆ సర్వేలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో 135 స్థానాల్లో గెలుపొందుతుందని, వైసీపీ 15 స్థానాల్లో గెలుస్తుందని, జనసేన, తదితరులకు మిగతా సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే లో తేలిందని టీడీపీ నాయకులు బయటకు చెప్పుకున్నారు. ఆ సర్వే ఎవరూ చేశారు.. దాంట్లో నిజమెంత అబద్దమెంత అనే దాని గురించి పక్కన బెడితే రాజకీయంగా ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి ఇలాంటి సర్వేలు పనిచేస్తుంటాయి.


ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో జగన్ ఓడిపోతున్నారని దాన్ని చూసి జగన్ ఉలికిపడ్డట్లు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తన పత్రికలో రాశారు. అయితే జగన్ చేయించుకున్న సర్వే రాధాకృష్ణకు ఎలా చేరింది. తమ అనుకూల పార్టీ గెలుపుకు రాధాకృష్ణ ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమేనని నిరూపించేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తారు.  దీని వల్ల ప్రభుత్వంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టవచ్చని అభిప్రాయం.


ప్రస్తుతం వైసీపీ కూడా ఇదే విధంగా ఎదురుదాడి చేస్తోంది. టీడీపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ కరవైందని భారీగా ఓట్ల శాతం పడిపోయిందని వైసీపీ చేసిన సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో 39 శాతం ఓటర్లు టీడీపీని ఆదరిస్తే 2021 అక్టోబర్ లో 21 శాతానికి పడిపోయింది. 2023 ఫిబ్రవరిలో సర్వే చేయిస్తే 26 శాతానికి టీడీపీ ఓట్ల శాతం పడిపోయిందని సర్వేలో తేలిందని వైసీపీ చెబుతున్న మాట. అయితే రెండు పార్టీలు సర్వేల పేరుతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశాయి.


మేం చేసిన సర్వేలో టీడీపీ గెలుస్తుందని, తెలుగుదేశం అనుకూల మీడియా ఢంకా బజాయించి చెబుతోంటే..  లేదు వైసీపీదే విజయం అని ప్రజల నుంచి వస్తున్న స్పందనే దానికి కారణమని జగన్ కు అనుకూలమైన చెప్పుకుంటున్నారు. ఈ మైండ్ గేమ్ లో ప్రజల మైండ్ సెట్ ను మార్చగలుగుతారా.. లేక రెండు పార్టీలు చేసుకున్న సర్వేలను చూసుకొని అధికారంలోకి వచ్చేశామని సంబరపడతారో వారే తేల్చుకోవాలి.



RRR Telugu Movie Review Rating

బాలికపై లైంగిక దాడి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>