Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-prekshakula-manasu-gelichina-d99a00a4-dd26-4616-be08-befddc811e1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-prekshakula-manasu-gelichina-d99a00a4-dd26-4616-be08-befddc811e1e-415x250-IndiaHerald.jpgభారత్ , ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఎంత ఘోర పరాభవాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎక్కడ టీమిండియా అటు ఆస్ట్రేలియా కు పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇండోర్ పిచ్ పై అద్భుతంగా పుంజుకున్న ఆస్ట్రేలియా టీమ్ ఇండియాని సొంత దేశంలోనే ముప్పు తిప్పలు పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో టీం ఇండియా పై ఘనవిజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా. అయితే మొదటి రెండు మ్యాచ్లలో గెలCricket{#}Hyderabad;Indore;Australia;Indiaమ్యాచ్ ఓడినా.. సిరాజ్ మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచాడు?మ్యాచ్ ఓడినా.. సిరాజ్ మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచాడు?Cricket{#}Hyderabad;Indore;Australia;IndiaSat, 04 Mar 2023 17:00:00 GMTభారత్ , ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఎంత ఘోర పరాభవాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎక్కడ టీమిండియా అటు ఆస్ట్రేలియా కు పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇండోర్ పిచ్ పై అద్భుతంగా పుంజుకున్న  ఆస్ట్రేలియా టీమ్ ఇండియాని  సొంత దేశంలోనే ముప్పు తిప్పలు పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో టీం ఇండియా పై ఘనవిజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా.



 అయితే మొదటి రెండు మ్యాచ్లలో గెలిచిన నేపథ్యం లో అటు బ్యాటింగ్లో కొంత అస్థిరత కనిపించినప్పటికీ పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం బ్యాట్స్మెన్లు పూర్తిగా చేతులేత్తేయ్యటం.. ఒక్కరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడంతో చివరికి భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత జట్టు ఓడిపోవడంపై అభిమానులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేలవ ప్రదర్శన పై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు.


 ఇదిలా ఉంటే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చేసిన పని మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది అని చెప్పాలి. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూప లేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయ లేకపోయాడు అని చెప్పాలి. కానీ ఇక అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయం లో ఒక అభిమాని సిరాజ్ను పిలిచాడు. ఈ క్రమం లోనే సిరాజ్ ఏకం గా అభిమాని దగ్గరికి వెళ్లి తన ఎనర్జీ డ్రింక్ ను అభిమానికి అందజేసాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది. ఇది చూసి సిరాజ్ అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు.
">



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ - దేవిశ్రీప్రసాద్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా..?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>