MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan2962f2ed-19c0-4c81-8135-c6d50b2e4952-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan2962f2ed-19c0-4c81-8135-c6d50b2e4952-415x250-IndiaHerald.jpg హరీష్ ఏమిచేసినా అతడి కాలం బాగుండకపోవడంతో సోషల్ మీడియాలో టార్గట్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో తాను తీయబోతున్న మూవీ ‘తెరి’ రీమేక్ అని ప్రకటించిన దగ్గర నుండి హరీష్ శంకర్ పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఈసినిమా రీమేక్ వద్దు అంటూ పవన్ అభిమానులు కూడ హరీష్ శంకర్ పై ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీలో పవన్ పక్కన హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేసారు అంటూ సోషల్ మీడియాలో వార్తల హడావిడి మొదలు కావడంతో మరొక విధంగా ట్రోలింగ్ మొదలైంది.పవన్ కళ్యాణ్ వయసులో సగం కూడ లేని శ్రీలీల అతడి పక్కన హీరోయిన్ pavankalyan{#}NTR;Pooja Hegde;Sridevi Kapoor;harish shankar;kalyan;Telugu;media;Remake;Heroine;Cinema;Newsపవన్ శ్రీలీల కాంబినేషన్ పై సెటైర్లు !పవన్ శ్రీలీల కాంబినేషన్ పై సెటైర్లు !pavankalyan{#}NTR;Pooja Hegde;Sridevi Kapoor;harish shankar;kalyan;Telugu;media;Remake;Heroine;Cinema;NewsSat, 04 Mar 2023 08:00:00 GMT
హరీష్ ఏమిచేసినా అతడి కాలం బాగుండకపోవడంతో సోషల్ మీడియాలో టార్గట్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో తాను తీయబోతున్న మూవీ ‘తెరి’ రీమేక్ అని ప్రకటించిన దగ్గర నుండి హరీష్ శంకర్ పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఈసినిమా రీమేక్ వద్దు అంటూ పవన్ అభిమానులు కూడ హరీష్ శంకర్ పై ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీలో పవన్ పక్కన హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేసారు అంటూ సోషల్ మీడియాలో వార్తల హడావిడి మొదలు కావడంతో మరొక విధంగా ట్రోలింగ్ మొదలైంది.



పవన్ కళ్యాణ్ వయసులో సగం కూడ లేని శ్రీలీల అతడి పక్కన హీరోయిన్ గా ఏమిటి అంటూ కొందరు సెటైర్లు సోషల్ మీడియాలో వేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకు వేసి గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల పక్కన శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఫోటోలను పెట్టి మళ్ళీ తెలుగు సినిమాలలో పాతకాలం రోజులు రిపీట్ అవుతున్నాయా అంటూ మరొక విధంగా జోక్ చేస్తున్నారు.



మరి కొందరైతే పవన్ తాను ప్రారంభించిన ‘హరిహర వీరమల్లు’ మధ్యలో వదిలేసి కొత్త సినిమాలు చేయడం ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీలీల పవన్ పక్కన హీరోయిన్ గా బాగుండదని అతడి అభిమానులు కూడ భావిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఆమెకు బదులుగా పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా అంటూ కొందరు సూచనలు కూడ చేస్తున్నారు. నిజానికి శ్రీలీల పవన్ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయిందా లేదా అన్న విషయమై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు.


కేవలం సోషల్ మీడియా వార్తలను ఆధారం చేసుకుని ఈ ట్రోలింగ్ నడుస్తోంది. దీనితో శ్రీలీల ఎంపిక విషయమై హరీష్ శంకర్ మరొక ఆలోచన చేసే ఆస్కారం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా మచిలీపట్నంలో జరగబోతున్న ‘జనసేన’ దశమ వార్షికోత్సవ సభలో పవన్ వర్థమాన రాజకీయాల పై ఎన్నికల పొత్తులపై ఎలా స్పందిస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..







RRR Telugu Movie Review Rating

శృతిహాసన్ ను ప్రేమించిన చిన్న హీరో.. కమల్ ఏం చేశాడో తెలుసా?

అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

తెలంగాణ: ఆ రెండు పార్టీల పొత్తు కుదిరేనా?

వైసీపీ చేయించిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు?

ఆ ఒక్క డైలాగ్‌తో.. బాబు, పవన్‌ నోరు మూయించిన జగన్‌?

రష్యాకే జై.. ఆ దేశంలో జనం తిరుగుబాటు?

నేపాల్‌.. చైనా కీలుబొమ్మగా మారిపోతోందా?

భారత సాయానికి ప్రపంచం ప్రశంసలు?

ఉక్రెయిన్‌ వార్‌: అమెరికా కుట్ర బయటపెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>