Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40c60b1d-732f-458d-a25d-1a7815a1b424-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40c60b1d-732f-458d-a25d-1a7815a1b424-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ ఇద్దరు.. ఒకరు స్టార్ హీరోగా.. మరొకరు స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో వీరిద్దరి కెరియర్ దాదాపు ఒకేసారి స్టార్ట్ అయింది. కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి మాత్రం ఎంతో సమయం పట్టింది. అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ఇక వీరి కాంబినేషన్ సెట్ అయింది.. అంతేకాదు సూపర్ హిట్ కొట్టేసింది. తాను కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన సినిమాలను మాత్రమే కాదNtr{#}Aravinda Sametha Veera Raghava;Fidaa;Jr NTR;Love;NTR;trivikram srinivas;News;Cinemaజూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా వదులుకుని తప్పు చేసాడా?జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా వదులుకుని తప్పు చేసాడా?Ntr{#}Aravinda Sametha Veera Raghava;Fidaa;Jr NTR;Love;NTR;trivikram srinivas;News;CinemaThu, 02 Mar 2023 08:56:10 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ  ఇద్దరు.. ఒకరు స్టార్ హీరోగా.. మరొకరు స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో వీరిద్దరి కెరియర్ దాదాపు ఒకేసారి స్టార్ట్ అయింది. కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి మాత్రం ఎంతో సమయం పట్టింది. అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ఇక వీరి కాంబినేషన్ సెట్ అయింది.. అంతేకాదు సూపర్ హిట్ కొట్టేసింది. తాను కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన సినిమాలను మాత్రమే కాదు యాక్షన్ సినిమాలను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించగలను అన్న విషయాన్ని అరవింద సమేత అనే సినిమాతో నిరూపించాడు త్రివిక్రమ్.


 ఇక ఈ సినిమాలో మాటలు మాంత్రికుడు రాసిన డైలాగులను ఎన్టీఆర్ తనదైన శైలిలో చెప్పడం చూసి అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. సినిమా సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్  కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని.. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ తెగ చక్కర్లు  కొట్టింది అని చెప్పాలి. అయితే ఇది నిజమేనని మరికొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన వస్తుందని అందరూ అనుకున్నారు. కాగా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు చివరికి ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రకటన బయటికి వచ్చింది.



 కానీ ఇక ఎన్టీఆర్ త్రివిక్రంతో సినిమాను వదులుకొని తప్పు చేశాడు అంటూ ప్రస్తుతం అభిమానులు కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే ఒకవేళ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకొని ఉంటే త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన కొన్ని రోజులకే షూటింగ్ మొదలయ్యి ఈపాటికి ఇక తారక్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడిని.. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇక కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే హిట్ కావడం పక్క. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇక ఇప్పుడు అయినను పోయి రావలే హస్తినకు సినిమా చేసి ఉంటే మరో హిట్ ఎన్టీఆర్ ఖాతాలో పడేదని అభిమానులు అనుకుంటున్నారట.



RRR Telugu Movie Review Rating

హాలీవుడ్ హీరోతో పోల్చిన యాంకర్.. చరణ్ ఏమన్నాడంటే?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>