MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthab6727e64-b30f-4351-8473-cdaa2766f1e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthab6727e64-b30f-4351-8473-cdaa2766f1e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానాన్ని ఎంజాయ్ చేసిన సమంత తన పెళ్ళి తరువాత ఎక్కువగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాల వైపు వెళ్ళిపోయింది. ఆతరువాత ఆమెకు వివాహబంధంలో సమస్యలు రావడం ఆపై అనారోగ్య సమస్యలు రావడంతో ఆమె కెరియర్ ప్రస్తుతం చాల ఒడుదుడుకులలో ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్.ప్రస్తుతం ఇండస్ట్రీకి టాప్ హీరోయిన్స్ సమస్య వెంటాడుతోంది. పూజా హెగ్డే రష్మిక లేటెస్ట్ గా వచ్చిన శ్రీలీల తప్ప టాప్ హీరోల సినిమాలకు వేరే ఆప్క్షన్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో సమంత తన కొత్త అవకాశాల కోసం టాలీవుడ్SAMANTHA{#}Vijayashanti;Samantha;Pooja Hegde;Heroine;bollywood;Tollywoodసమంత వ్యూహాలలో పొరపాట్లు !సమంత వ్యూహాలలో పొరపాట్లు !SAMANTHA{#}Vijayashanti;Samantha;Pooja Hegde;Heroine;bollywood;TollywoodThu, 02 Mar 2023 10:00:00 GMTటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానాన్ని ఎంజాయ్ చేసిన సమంత తన పెళ్ళి తరువాత ఎక్కువగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాల వైపు వెళ్ళిపోయింది. ఆతరువాత ఆమెకు వివాహబంధంలో సమస్యలు రావడం ఆపై అనారోగ్య సమస్యలు రావడంతో ఆమె కెరియర్ ప్రస్తుతం చాల ఒడుదుడుకులలో ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్.




ప్రస్తుతం ఇండస్ట్రీకి టాప్ హీరోయిన్స్ సమస్య వెంటాడుతోంది. పూజా హెగ్డే రష్మిక లేటెస్ట్ గా వచ్చిన శ్రీలీల తప్ప టాప్ హీరోల సినిమాలకు వేరే ఆప్క్షన్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో సమంత తన కొత్త అవకాశాల కోసం టాలీవుడ్ లో ప్రయత్నించకుండా బాలీవుడ్ లో ఎందుకు ప్రయత్నిస్తోంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.




మరికొందరైతే నాగచైతన్యతో ఆమె విడిపోయిన తరువాత ఆమె కావాలని టాలీవుడ్ కు దూరంగా ఉంటోందా లేక ఇండస్ట్రీలోని టాప్ హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదా అన్న సందేహాలు కూడ వ్యక్త పరుస్తున్నారు. గతంలో విజయశాంతి అనుసరించిన కెరియర్ ఫార్మలా ఆమె అనుసరిస్తే బాగుంటుంది కదా అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. అప్పట్లో విజయశాంతి గ్లామర్ పాత్రలు చేస్తూనే మధ్యమధ్యలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ తన కెరియర్ కొనసాగించింది.



ఇప్పుడు సమంత కూడ అలాగే టాప్ హీరోలతో కాకపోయినా మీడియం రేంజ్ హీరోల పక్కన నటించే ప్రయత్నాలు చేయవచ్చు కదా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఆమెకు గాయాలు అయినట్లుగా కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేసింది. వరసపెట్టి ఆమెకు వస్తున్న అనారోగ్య సమస్యలు వల్ల ఆమె పై సింపతీ పెరుగుతుంది కానీ ఆమెకు కొత్త అవకాశాలు రాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడ కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సమంత తన కెరియర్ కు సంబంధించి చేస్తున్న పొరపాట్లు గురించి నిశితంగా ఆలోచిస్తే బాగుంటుంది అంటూ ఆమె అభిమానులు ఆమెకు సలహాలు ఇస్తున్నారు..





RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" షూటింగ్ అంత శాతం పూర్తి..!

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>